Maha Kumbhmela 2025: కుంభమేళా తొక్కిసలాట ఘటనపై త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేసిన యూపీ గవర్నమెంట్..

Maha Kumbhmela 2025: మౌనీ అమావాస్య సందర్భంగా త్రివేణీ సంగమంలో జరిగిన తొక్కిసలాట దుర్ఘటనపై యూపీ సర్కారు నియమించిన త్రిసభ్య న్యాయ విచారణ సంఘం నిన్న ప్రమాదస్థలిని పరిశీలించింది. సంబంధిత అధికారులతో చర్చలు జరిపింది.

Written by - TA Kiran Kumar | Last Updated : Feb 1, 2025, 08:31 AM IST
Maha Kumbhmela 2025: కుంభమేళా తొక్కిసలాట ఘటనపై త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేసిన యూపీ గవర్నమెంట్..

Maha Kumbhmela 2025: ఉత్తర ప్రదేశ్ ఆధ్యాత్మిక రాజధాని ప్రయాగ్ రాజ్ లో మౌనీ అమావాస్య సందర్బంగా జరిగిన తొక్కిసలాట నేపథ్యంలో పలువురు గాయపడ్డారు. దీనిపై యూపీ గవర్నమెంట్ అలహాబాద్‌ హైకోర్టు రిటైర్టు న్యాయమూర్తి జస్టిస్‌ హర్ష్‌కుమార్‌ సారథ్యంలో ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో మాజీ డీజీపీ వి.కె.గుప్తా, రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి డి.కె.సింగ్‌ సభ్యులుగా ఉన్నారు. వీరంతా క్షతగాత్రులు చికిత్స పొందుతున్న స్వరూప్‌రాణి నెహ్రూ ఆసుపత్రిని సందర్శించి బాధితులతో మాట్లాడారు. ప్రమాదస్థలాన్ని పరిశీలించి, పరిస్థితులు సమీక్షించారు. ఈ నేపథ్యంలో ఇప్పుడే ఏమీ చెప్పలేమని తెలిపారు.

మరోవైపు భక్తుల రద్దీతో కాశీలో గంగాహారతి నిలిపివేశారు. ప్రయాగ్‌రాజ్‌ మహా కుంభమేళాకు కోట్ల సంఖ్యలో వస్తున్న భక్తులు అక్కడి నుంచి 120 కి.మీ.ల దూరాన ఉన్న వారణాసికి భారీగా తరలివస్తున్నారు. జనం రద్దీ దృష్ట్యా ఫిబ్రవరి 5 వరకు వారణాసి ఘాట్‌ల వద్ద గంగాహారతి కార్యక్రమాన్ని నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఘాట్‌ల వద్ద ప్రమాదాలు జరగకుండా నివారించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

ఇదీ చదవండి : చిరంజీవి, కీర్తి సురేష్ తల్లితో రొమాన్స్ చేసిన ఈ సినిమా తెలుసా..! అందులో మెగాస్టార్ విలన్..

మౌనీ అమావాస్య నుంచి కాశీలో భక్తుల రద్దీ మరింత పెరిగింది. దూర ప్రాంతాల భక్తుల తాకిడి తగ్గేవరకు ఇతరులు ఎవరూ వారణాసికి రావద్దని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. స్థానికులు అవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని పోలీస్‌ కమిషనరు మోహిత్‌ అగర్వాల్‌ కోరారు. కొందరు ప్రయాణికులు వారణాసి, బనారస్‌ రైల్వేస్టేషన్లలో చిక్కుకుపోయారని, భద్రతా బలగాలు నిరంతరం గస్తీ తిరుగుతున్నట్లు తెలిపారు.

ఇదీ చదవండి : ప్రస్తుత మార్కెట్ వాల్యూ ప్రకారం నాగార్జున ‘అన్నపూర్ణ స్టూడియో’ మార్కెట్ విలువ ఎంతో తెలుసా..?

ఇదీ చదవండి:   గడ్డకట్టే చలిలో నాగ సాదువులు నగ్నంగానే ఎందుకు ఉంటారు.. అసలు రహస్యం అదేనా..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News