Delhi Assembly Election Results: తాజాగా జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించింది. దాదాపు
ఎంతో ప్రతిష్ఠాత్మకంగా జరిగిన ఢిల్లీ ఎన్నికల్లో దాదాపు 27 సుధీర్ఘ విరామం తర్వాత ఢిల్లీ గద్దెపై బీజేపీ జెండా ఎగిరింది. వరుసగా రెండు సార్లు అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీకి అక్కడి ఓటర్లు గట్టి బుద్ధి చెప్పారు. రెండు సార్లు దాదాపు క్లీన్ స్వీప్ చేసిన చీపురు పార్టీని ఢిల్లీ వాసులు ఛీత్కరించారు. ముఖ్యంగా ఢిల్లీ గద్దె దిగడానికి ఆప్ చేసిన స్వయంకృతాపరాధాలే ఆ పార్టీని ఓడించేలా చేశాయి. అయితే ఈ ఎన్నికల్లో బీజేపీ గెలవడానికి గత కారణం.. ముఖ్యమంత్రి అభ్యర్ధిని ప్రకటించకుండా ఎన్నికలకు వెళ్లడం ఆ పార్టీకి కలిసొచ్చింది. ఢిల్లీ శాసనసభ ఎలక్షన్స్ లో భారతీయ జనతా పార్టీ సీఎం ఫేస్ లేకుండా.. కేవలం పీఎం నరేంద్ర మోడీతో పాటు బీజేపీ ముఖ్యనేతల ముఖంతోనే తోనే ఎలక్షన్స్ ను ఫేస్ చేసింది.
2023లో జరిగిన రాజస్థాన్, మధ్య ప్రదేశ్, ఛత్తీస్ ఘడ్ ఎన్నికల్లో ముఖ్యమంత్రి పేరు చెప్పకుండానే ఎన్నికల బరిలో దిగింది. సార్వత్రిక ఎన్నికల తర్వాత జరిగిన హర్యానా, మహారాష్ట్ర ఎన్నికల్లో ఈ ఫార్ములా బీజేపీకి ముఖ్యమంత్రి పీఠం దక్కేలా చేసింది. తాజాగా జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అదే ఫార్ములాను బీజేపీ అప్లై చేసి ఘన విజయం సాధించింది. మరి ఆయా రాష్ట్రాల్లో వర్కౌట్ అయినా.. ఈ బ్లాక్ బస్టర్ ఫార్ములా ఇపుడు ఢిల్లీ ఓటర్లను ప్రభావితం చేసి బీజేపీకి అధికారం కట్టబెట్టింది. ఇక్కడి 70 సీట్లకు 48 సీట్లలో విజయం సాధించింది. మరోవైపు ఆప్ పార్టీ 22 సీట్లతో ప్రతిపక్ష స్థానానికి పరిమితమైంది.
ఇదీ చదవండి : ప్రస్తుత మార్కెట్ వాల్యూ ప్రకారం నాగార్జున ‘అన్నపూర్ణ స్టూడియో’ మార్కెట్ విలువ ఎంతో తెలుసా..?
ఈ సారి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ ఫేస్ తో కాకుండా.. ఢిల్లీలో ఎక్కడికక్కడ స్థానిక పరిస్థితులను బేరీజు వేసుకొని కార్యరంగంలోకి దిగింది. ముఖ్యంగా మిడిల్ క్లాస్ ప్రజల్లో ఆమ్ ఆద్మీ పార్టీపై ఉన్న భ్రమలు తొలిగించడంలో సక్సెస్ అయింది. ఇక కేజ్రీవాల్ గతంతో ఈ జన్మలో నన్ను ఓడించడం మోడీ తరం కాదు.. ఆయన ఇంకో జన్మ ఎత్తాల్సిందే అని వ్యంగ్యంగా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మొత్తంగా ఆమ్ ఆద్మీ పార్టీ అధినేతగా అరవింద్ కేజ్రీవాల్ అహంకారాన్ని ఓటర్లు చాచి లెంపకాయ కొట్టారు. మొత్తంగా స్వాతంత్య్రం తర్వాత ఢిల్లీ రాష్ట్రంతో పాటు కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండటం గమనార్హం. అయితే.. అరవింద్ కేజ్రీవాల్ పై గెలిచిన జాట్ నేత పర్వేష్ సాహెబ్ సింగ్ ముఖ్యమంత్రి రేసులో ఉన్నారు.
ఇదీ చదవండి: గడ్డకట్టే చలిలో నాగ సాదువులు నగ్నంగానే ఎందుకు ఉంటారు.. అసలు రహస్యం అదేనా..!
ఇదీ చదవండి : చిరంజీవి, కీర్తి సురేష్ తల్లితో రొమాన్స్ చేసిన ఈ సినిమా తెలుసా..! అందులో మెగాస్టార్ విలన్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.