BSNL Recharge Plans: దేశంలోని ప్రైవేట్ టెలీకం కంపెనీలు గత ఏడాది దాదాపు అన్ని రీఛార్జ్ ప్లాన్స్ టారిఫ్ పెంచినప్పటి నుంచి బీఎస్ఎన్ఎల్‌కు డిమాండ్ పెరిగింది. అదే సమయంలో ఆకర్షణీయమైన ప్లాన్స్ అందిస్తూ యూజర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. ఇప్పుడు కొత్తగా లైవ్ టీవీ ఛానెల్స్, ఓటీటీ సేవలు ఉచితంగా అందిస్తోంది.
బీఎస్ఎన్ఎల్ కొత్తగా ప్రవేశపెట్టిన వాయిస్ ఓన్లీ ప్లాన్స్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఇందులో 99 రూపాయలు, 439 రూపాయలతో రెండు ప్లాన్స్ ఉన్నాయి. ఈ ప్లాన్స్‌తో డేటా ఉండదు. కేవలం అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్, ఉచిత ఎస్ఎంఎస్ ఉంటాయి. దాంతో పాటు బీటీవీ యాక్సెస్ ఉంటుంది. దీని ద్వారా 450 లైవ్ టీవీ ఛానెళ్లను ఉచితంగా చూడవచ్చు. కేబుల్ టీవీ, డీటీహెచ్ ప్రసారాలకు ప్రత్యామ్నాయంగా బీటీవీని బీఎస్ఎన్ఎల్ ప్రవేశపెట్టింది. ఓటీటీ ప్లేతో కలిసి బీఎస్ఎన్ఎల్ డైరెక్ట్ టు మొబైల్ డీ 2 ఎం సేవల్ని ప్రవేశపెట్టింది. లైవ్ టీవీ ఛానెల్స్ వీక్షించేందుకు ఎలాంటి డేటా లేదా వైఫై అవసరం లేదు.
వీటితో పాటు అత్యంత చౌక ధరకు దీర్ఘకాలిక ప్లాన్ తీసుకొచ్చింది. ఈ ప్లాన్ టారిఫ్ కేవలం 797 రూపాయలు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 300 రోజులు ఉంటుంది. ఇందులో మొదటి 60 రోజులు అన్ని నెట్‌వర్క్‌లకు అన్‌లిమిటెడ్ కాలింగ్ రోజుకు 2జీబీ డేటా లభిస్తుంది. రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు పంపించుకోవచ్చు. అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్, డేటా ప్రయోజనాలు మొదటి 60 రోజులే ఉంటాయి. అయితే ఆ తరువాత 240 రోజులు సిమ్ మాత్రం యాక్టివేషన్‌లోనే ఉంటుంది.
Also read: AP Politics: ఏపీలో మారుతున్న సమీకరణాలు, జగన్ కోసం పనిచేయనున్న చంద్రబాబు ఎన్నికల వ్యూహకర్త
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి