Aadhaar: పెళ్లి తర్వాత ఆధార్‌ కార్డుపై అడ్రస్‌ మార్చుకోవాలా? ఇలా సింపుల్‌గా మొబైల్‌లోనే మార్చుకోండి..

Aadhaar Card Address Change: ఆధార్‌ కార్డు మన దేశంలో ఒక గుర్తింపు కార్డు. ఇది ప్రతి ఒక్కరూ కలిగి ఉండాల్సిన కార్డు. ఇందులో ఒక వ్యక్తి పేరు, ఫోన్‌నంబర్‌, అడ్రస్‌తో పాటు బయోమెట్రిక్‌ వివరాలు కూడా ఉంటాయి. అయితే, పెళ్లైన అమ్మాయిలు ఆధార్‌ కార్డుపై అడ్రస్‌ మార్చుకోవాల్సి ఉంటుంది. ఇలా సింపుల్‌గా మొబైల్‌లో కూడా మార్చుకోవచ్చు తెలుసా?

Written by - Renuka Godugu | Last Updated : Feb 23, 2025, 06:48 AM IST
Aadhaar: పెళ్లి తర్వాత ఆధార్‌ కార్డుపై అడ్రస్‌ మార్చుకోవాలా? ఇలా సింపుల్‌గా మొబైల్‌లోనే మార్చుకోండి..

Aadhaar Card Address Change: గతంలో ఆధార్‌ కార్డుపై అడ్రస్‌ లేదా ఫోన్‌ నంబర్‌ మార్చుకోవాలంటే పెద్ద టాస్క్‌గా మారేది. కానీ, యూఐడీఏఐ ప్రస్తుతం ఆ కష్టాలకు చెక్ పెట్టింది. ఆధార్‌ సర్వీస్‌ సెంటర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. అక్కడ మీరు ముందస్తుగా స్లాట్‌ బుక్‌ చేసుకుని వారు ఇచ్చిన తేదీకి వెళ్లి అడ్రస్‌ మార్పు చేసుకున్నా సరిపోతుంది. అయితే, చాలా మంది అమ్మాయిలకు పెళ్లి తర్వాత ఆధార్‌ కార్డుపై అడ్రస్‌, ఫోన్‌ నంబర్‌ మార్చుకోవాల్సి ఉంటుంది. అలాంటి వారికోసం యూనిక్‌ ఐడెంటిఫికేషన అథారిటీ ఆఫ్‌ ఇండియా (UIDAI) సింపుల్‌గా అప్డేట్‌ చేసుకునే సౌలభ్యం కల్పించింది. దీంతో ఇంట్లో కూర్చొని కూడా మొబైల్‌ లేదా ల్యాప్‌టాప్‌లోనే మొబైల్‌ నంబర్‌ లేదా ఇంటి అడ్రస్‌ మార్చుకోవచ్చు. దీనికి కొన్ని సింపుల్‌ టిప్స్‌ పాటిస్తే సరిపోతుంది. 

మీరు కూడా ఆధార్‌ కార్డుపై అడ్రస్‌ మార్చుకోవాలనుకుంటున్నారా? అయితే, మీరు ఇంట్లోనే ఎలాంటి టెన్షన్‌ లేకుండా యూఐడీఏఐ అధికారిక వెబ్‌సైట్‌లో మార్చుకోవచ్చు. దీనికి ముందుగా ఈ అధికారిక వెబ్‌సైట్‌ను ఓపెన్‌ చేయాల్సి ఉంటుంది.

దీనికి మీ వద్ద ఆధార్‌ కార్డు, దానితో లింక్‌ అయిన రిజిస్టర్డ్‌ మొబైల్‌ నంబర్‌ కూడా కలిగి ఉండాలి. ఎందుకంటే ఆ ఫోన్‌ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఉంటేనే ఆధార్‌ కార్డు అప్డేట్ చేయడానికి సాధ్యమవుతుంది. యూఐడీఏఐ అధికారిక వెబ్‌సైట్‌లో అప్డేట్‌ అడ్రస్‌ ఆప్షన్‌ ఎంచుకోవాలి. అక్కడ మీరు ఉంటున్న కొత్త ఇంటి అడ్రస్‌ను పూర్తిగా నమోదు చేయాలి. అయితే, వీటితోపాటు మీ కొత్త ఇంటి అడ్రస్‌ ప్రూఫ్‌ కూడా స్కాన్‌ చేసి అప్లోడ్‌ చేయాల్సి ఉంటుందని మర్చిపోకండి.  ఇది పూర్తయిన తర్వాత మీకు ఒక యూఆర్‌ఎన్‌ మెసేజ్‌ మీ రిజిస్టర్డ్‌ మొబైల్‌ నంబర్‌కు వస్తుంది. 

ఇదీ చదవండి:  Guava Leaves: జీరో బడ్జెట్‌ లైఫ్‌స్టైల్‌.. ఈ ఆకు మీ ఇంట్లో ఉంటే 100 రోగాలు పరార్‌..!

పెళ్లి తర్వాత అడ్రస్‌ మార్చుకుంటే మీ వద్ద మ్యారెజ్‌ సర్టిఫికేట్‌ ఉంటే అది ప్రూఫ్‌గా కూడా అప్లోడ్‌ చేయవచ్చు. మీ పూర్తి వివరాలు వెరిఫై అయిన తర్వాత కొత్త ఇంటి నంబర్‌ త్వరలోనే అప్డేట్‌ అయిపోతుంది.

ఇదీ చదవండి: Rose Water: ఈ నీరు ఉంటే చాలు.. ఏ ఫేస్‌ క్రీముల అవసరం ఉండదు.. 

ఇది కాకుండా అడ్రస్‌ మార్పు కోసం మీ దగ్గరలో ఉన్న ఆధార్‌ సెంటర్‌కు కూడా వెళ్లి మార్చుకోవచ్చు. ప్రస్తుతం ఈ-సేవ సెంటర్లలో కూడా ఈ సేవలు అందిస్తున్నారు. దీనికి నామమాత్రపు ఛార్జీలు వసూలు చేస్తున్నారు. అక్కడకు వెళ్లి ఆధార్‌ కార్డు ఆపరేటర్‌ను అడ్రస్‌ అప్డేట్‌ చేయమని అడగండ. వారు ఇచ్చిన ఫారమ్‌ మీరు ఫిల్‌ చేయాల్సి ఉంటుంది. కొత్త అడ్రస్‌ నమోదు చేయాలి. మీరు ఈ ఫారమ్‌తోపాటు కొత్త ఇంటికి చెందిన అడ్రస్‌ ప్రూఫ్‌ కూడా ఒక కాపీ అక్కడ సబ్మిట్‌ చేయాలి. ఓ 15 రోజులు పూర్తయిన తర్వాత అడ్రస్‌ మారుతుంది. అయితే, ఆన్‌లైన్‌లోనే మీరు ఆధార్‌ పీవీసీ కార్డుకు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అప్పుడు అడ్రస్‌ మారిన ఆధార్‌ మీ ఇంటికి పోస్ట్‌లో వస్తుంది.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News