Prasanth Varma Brahma Rakshasa: బ్రహ్మ రాక్షస సినిమా నుంచి రణవీర్ సింగ్ తప్పుకున్న సంగతి తెలిసిందే. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో ఫైనల్ గా తెలుగు హీరో రానా ఫిక్సయినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ చిత్రం రానా అభిమానుల్లో భారీ అంచనాలను పెంచుతోంది. రానా ఈ కొత్త ప్రాజెక్ట్‌కి ఒప్పుకోవడం ఆసక్తికరంగా మారింది.
RGV New Movie: ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరో సంచలన ట్వీట్ చేశారు. ఈసారి ఇది సీరియస్ కానుంది. నాసిరకం సినిమాల నుంచి తిరిగి ట్రాక్ లోకి వచ్చేందుకు భారీ సినిమా ప్రకటించాడు. ఆ సినిమా ఎలా ఉంటుందో కూడా వివరించాడు.
Farah Khan YouTube blog: బాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ గా గుర్తింపు తెచ్చుకున్న ఫరా ఖాన్ తన యూట్యూబ్ బ్లాగ్ ద్వారా అనేక విషయాలను పంచుకుంటూ ఉంటుంది. తన యూట్యూబ్ బ్లాగ్ లో.. అర్చన పురాన్ సింగ్ తో మాట్లాడుతున్నప్పుడు తన భర్త స్వలింగ సంపర్కుడు కాదని భావిస్తున్నట్లు చెప్పి అందరిని ఆశ్చర్యపరిచింది.
Samantha game changer: సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉండే సాయి పల్లవి తాజాగా ఒక సుదీర్ఘ నోటు వదులుతూ.. అదే నా జీవితానికి అతిపెద్ద గేమ్ చేంజర్ అంటూ కామెంట్లు చేసింది. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.
Game Changer Ott Streaming Date: రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన చిత్రం ‘గేమ్ చేంజర్’. ఈ సినిమా సంక్రాంతి కానుకగా మొదటగా విడుదలైంది. మంచి సబ్జెక్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా స్క్రీన్ ప్లే లోపాల కారణంగా బాక్సాఫీస్ దగ్గర అనుకున్న ఫలితాన్ని అందుకోలేదు. తాజాగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ లాక్ అయింది.
Dil raju mother hospitalized: దిల్ రాజు తల్లి ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. వెంటనే హుటా హుటీన కుటుంబ సభ్యులు ఐటీ అధికారులు వాహానంలోనే ఆస్పత్రికి తరలించారు.
Pushpa 2 Real Collections: అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ డైరెక్షన్ లో తెరకెక్కిన మూవీ ‘పుష్ప 2’. గతేడాది చివర్లో విడుదలైన ఈ సినిమా తెలుగుతో పాటు హిందీలో సంచలన విజయం సాధించింది. ఇక నార్త్ బెల్ట్ లో ఈ సినిమా అన్ని రికార్డులను మడత పెట్టేసింది. ఈ సినిమా రికార్డు బ్రేక్ కలెక్షన్స్ రాబట్టింది. ఈ నేపథ్యంలో టాలీవుడ్ నిర్మాతలపై ఐటీ రైడ్స్ కలకలం రేపింది. ఈ నేపథ్యంలో పుష్ప 2 అసలు కలెక్షన్స్ గుట్టు వీడినట్టు వార్తలు వస్తున్నాయి.
Saif ali khan stabbing case: సైఫ్ అలీఖాన్ ను కాపాడినా ఆటోవాల సోషల్ మీడియాలో ఒక్కసారిగా ఫెమస్ అయిపోయారు. ఆయనకు సింగర్ మికా సింగ్ భారీ నజరాన ప్రకటించారు.
Case on RGV: రామ్ గోపాల్ వర్మ అంటే చాలు మనకు ముందుగా గుర్తొచ్చేది కాంట్రవర్సీస్. ఏదో ఒక కాంట్రవర్సీ రూపంలో ఉంది తరచూ వార్తల్లో నిలుస్తూ ఉంటారు ఈ డైరెక్టర్. ఈ క్రమంలో రామ్ గోపాల్ వర్మకు చెక్ బౌన్స్ కేసులో మూడు నెలల సాధారణ జైలు శిక్ష విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ముంబై మేజిస్ట్రేట్ కోర్టు.
Daaku Maharaaj success Meet: నందమూరి బాలకృష్ణ హీరోగా బాబీ దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ ప్రొడక్షన్స, శ్రీకర ప్రొడక్షన్స్ సంయుక్త నిర్మాణంలో తెరకెక్కిన చిత్రం ‘డాకు మహారాజ్’. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ మూవీ సక్సెస్ అయిన నేపథ్యంలో అనంతపురంలో విజయోత్సవ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ సినిమాలో కీలక పాత్ర పోషించిన శ్రద్ధా శ్రీనాథ్ బాలయ్యకు పబ్లిక్ గా ఐ లవ్ యూ చెప్పడం హాట్ టాపిక్ గా మారింది.
Tollywood IT Rides: గత కొన్నేళ్లుగా సినిమాల్లో కలెక్షన్స్ కు సంబంధించిన పోకడ ఎక్కువైంది. ఎవరు నిజం చెబుతున్నారు. ఎవరు అబద్ధం చెబుతున్నారనేది పై వాడికి ఎరక అన్నట్టు తయారైంది పరిస్థితి. ఈ నేపథ్యంలో ఒక్కోసారి హీరోలను సంతృప్తి పరచడానికి ఎక్కువ నంబర్స్ కలెక్షన్స్ తో పోస్టర్ ను రిలీజ్ చేస్తున్నారు. దీన్ని బేస్ చేసుకొని ఆదాయపు పన్ను అధికారులు ఒక్కసారి తెలుగులో అగ్ర నిర్మాతలైన దిల్ రాజు, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతల ఇళ్లు, కార్యాలయాలపై దాడులు నిర్వహించారు.
Mouni Roy: మౌనీ రాయ్.. ఈమె చేసిన సినిమాల కంటే తన అందాల ప్రదర్శనతో పాటు ఆటిట్యూట్ తో మోస్ట్ పాపులర్ అయింది. ముఖ్యంగా 'నాగిని' సీరియల్లో తన నటన కంటే స్కిన్ షోతో ప్రేక్షకులను ఫిదా చేసింది. స్మాల్ స్క్రీన్ నుంచి బిగ్ స్క్రీన్ పై తన అంద చందాలతో హీట్ పుట్టిస్తూనే ఉంది.
Khushi Kapoor: ఖుషీ కపూర్..అక్క జాన్వీ బాటలోనే శ్రీదేవి కూతురుగా ఈమెకు సామాజిక మాధ్యమాల్లో మంచి ఫాలోయింగ్ ఏర్పరుచుకుంది. సినీ ఇండస్ట్రీలో రాకముందే ఖుషీ తనకంటూ స్పెషల్ ఐడెంటిటీ తెచ్చుకుంది. అంతేకాదు అక్క జాన్వీ కపూర్ బాటలో సౌత్ సినీ ఇండస్ట్రీ నుంచే సినీ రంగ ప్రవేశం చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం.
Disha Patani: దిశా పటానీ.. నార్త్ భామ అయిన తెలుగులో పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన 'లోఫర్' చిత్రంతో హీరోయిన్ గా వెండితెరకు ఇండ్రడ్యూస్ అయింది. ఈ సినిమా రిలీజ్ అపుడు ఈమె బాలీవుడ్ టాప్ స్టార్ గా ఎదుగుతుందని ఎవరు ఎక్స్ పెక్ట్ చేయలేదు. స్టార్ డమ్ బోలెడంతా ఉన్నా.. అందాల ఆరబోతలో ఎక్కడ వెనక్కి తగ్గకపోవడం విశేషం. తాజాగా బీచ్ లో బికినీలో కనిపించి కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తోంది.
Balakrishna Speech in Daaku Maharaaj Succes Meet: నందమూరి బాలయ్యకు సంక్రాంతి కథానాయకుడు అనే పేరుంది. అందుకు తగ్గట్టే.. ఈ ఇయర్ పొంగల్ పోటీలో ‘డాకు మహారాజ్’ గా ఆడియన్స్ ముందుకొచ్చాడు. ఈ సినిమా ఫస్ట్ టాక్ నుంచే హిట్ సొంతం చేసుకొని మాస్ ఏరియాల్లో ఇరగదీస్తోంది. దీంతో ఇప్పటికే చిత్ర యూనిట్ హైదరాబాద్ లో సక్సెస్ మీట్ ను నిర్వహించింది. తాజాగా ఈ మూవీ విజయోత్సవ సభను ఏపీలో తన అడ్డా అయిన అనంతపురంలో గ్రాండ్ గా జరిగింది. ఈ మీట్ లో బాలయ్య చేసిన గర్జన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Second Day IT Raids In Dil Raju House: సంక్రాంతి పండుగకు మూడు సినిమాలు విడుదల చేసి సంచలనం రేపిన దిల్ రాజుకు భారీ షాక్ తగిలింది. వరుసగా రెండో ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు జరిపారు. ఈ సందర్భంగా దిల్ రాజు నివాసం, కార్యాలయాల్లో భారీగా నోట్ల కట్టలు కనిపించాయనే వార్త సంచలనం రేపింది.
Rashmika Mandanna Viral Video : రష్మిక తాజాగా చావా సినిమా ఈవెంట్ లో భాగంగా కుంటుకుంటూ స్టేజ్ పైకి రావడంతో.. విక్కీ కౌశల్ ఆమెకు సహాయం చేశారు. ప్రస్తుతం ఎందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ రష్మిక అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
Bollywood Star Heroine: స్టార్ కిడ్స్ అంటే గోల్డెన్ స్పూన్ బేబిలని అందురు అనుకోవడం సహజం. కానీ కొన్నిసార్లు వాళ్లు కూడా సామాన్యుల్లా కష్టాలు పడ్డ సందర్భాలుంటాయి. స్టార్ నటీనటులు ఒకానొక టైమ్ లో సినిమాలు తీసి డబ్బులు పోగొట్టుకున్నపుడు వారి బతుక బస్టాండ్ అయిన సందర్భాలు కోకొల్లలు.
Pushpa 2 Team Effect From IT Raids: పుష్ప 2 సినిమా బృందానికి భారీ షాక్ తగిలింది. దర్శకుడు సుకుమార్, నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ యజమానుల ఇళ్లపై ఆదాయపు పన్ను అధికారులు దాడులు చేశారు. సినిమా కలెక్షన్లు.. వసూళ్లు వంటి వాటిపై వివరాలు సేకరించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.