Saudi Film Nights: హైదరాబాద్‌లో ఘనంగా సౌదీ ఫిలిమ్ నైట్స్..

Saudi Film Nights: భాగ్య నగరం అంతర్జాతీయ నగరంగా ఎపుడో రూపాంతరం చెందింది. అందుకే దేశ, విదేశాలకు సంబంధించిన ఎన్నో ఈవెంట్స్ కు హైదరాబాద్ వేదికగా నిలుస్తోంది. ఇప్పటికే పలు క్రికెట్ టోర్నమెంట్స్,  అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలు హైదరాబాద్ లో కన్నుల పండువగా జరిగాయి. తాజాగా హైదరాబాద్ ఘనంగా సౌదీ ఫిలిమ్ నైట్స్ కు వేదికగా నిలిచింది.

Written by - TA Kiran Kumar | Last Updated : Feb 7, 2025, 08:52 PM IST
Saudi Film Nights: హైదరాబాద్‌లో ఘనంగా సౌదీ ఫిలిమ్ నైట్స్..

Saudi Film Nights: తాజాగా  డిఫరెంట్  కథాంశంతో సౌదీ ఫిలిం కమిషన్ తెరకెక్కించిన చిత్రాలను బంజారాహిల్స్ లోని ఆర్కే పివిఆర్ లో ప్రదర్శించారు.సౌదీ అరేబియా, భారతదేశాల మధ్య సాంస్కృతిక సంబంధాలను బలోపేతం దిశగా  ఈ మూవీ ఫెస్టివల్  నిర్వహిస్తున్నట్లు డోమ్ ఎంటర్టైన్మెంట్స్ మహమ్మద్ మొరాని తెలిపారు. డోమ్ ఎంటర్‌టైన్‌మెంట్  మీడియా  అండ్  ఎంటర్‌టైన్‌మెంట్స్ కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమం అద్భుతమైన సక్సెస్ ను సాధించింది. పెద్ద సంఖ్యలో ప్రేక్షకులు విచ్చేసి షార్ట్  ఫిలిమ్స్ ను  వీక్షించి పరవశించిపోయారు.

శ్రీ మహమ్మద్ మొరానీ, శ్రీమతి లక్కీ మొరానీ, మిస్టర్ మజర్ నదియాడ్‌వాలా మరియు మిస్టర్ అలీమ్ మొరానీ వంటి వారు ఛీఫ్ గెస్ట్ లను  ఘనంగా స్వాగతించారు. సౌదీ ఫిల్మ్ నైట్స్ - సౌదీ సినిమా కళాత్మక నైపుణ్యతను హైలైట్ చేస్తూ సౌదీ అరేబియా, భారతదేశం మధ్య సాంస్కృతిక బంధాన్ని పెంపొందించే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు.  

ఇదీ చదవండి : చిరంజీవి, కీర్తి సురేష్ తల్లితో రొమాన్స్ చేసిన ఈ సినిమా తెలుసా..! అందులో మెగాస్టార్ విలన్..

ఇదీ చదవండి:   గడ్డకట్టే చలిలో నాగ సాదువులు నగ్నంగానే ఎందుకు ఉంటారు.. అసలు రహస్యం అదేనా..!

ఈ కార్యక్రమం ద్వారా సౌదీ చలనచిత్ర నిర్మాణం, వారి నైపుణ్యతను అందరికీ తెలియజేశారు. సౌదీ, భారతీయ చలనచిత్ర పరిశ్రమల మధ్య సినిమా సంబంధాలను మరింత బలోపేతం చేస్తూ, రెండు దేశాల మధ్య భవిష్యత్తులో సహకారానికి మార్గం సుగమం చేసేలా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

ఇదీ చదవండి : ప్రస్తుత మార్కెట్ వాల్యూ ప్రకారం నాగార్జున ‘అన్నపూర్ణ స్టూడియో’ మార్కెట్ విలువ ఎంతో తెలుసా..?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News