Sai Pallavi Dance With Naga Chaitanya: అక్కినేని నాగచైతన్య తండేల్ సినిమా సక్సెస్ కావడంతో ఫుల్ జోస్ మీద ఉన్నారు.. దీంతో చిత్ర బృందం ఒక సక్సెస్ మీట్ ని కూడా ఏర్పాటు చేసింది. ఒకవైపు బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్స్ తో దూసుకుపోతూ డైరెక్టర్ చందు మొండేటి కూడా ఈ సినిమాని అద్భుతంగా తెరకెక్కించారనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి.
తండేల్ సక్సెస్ మీట్ కి సాయి పల్లవి, నాగచైతన్య, అల్లు అరవింద్ తో పాటుగా చిత్ర బృందం రావడంతో అక్కడ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నట్లుగా పలు రకాల వీడియోలు వైరల్ గా మారుతున్నాయి.
హైదరాబాదులో గ్రాండ్ సక్సెస్ మీట్ ని నిర్వహించగా ఇందులో తండేల్ సినిమాకి సంబంధించి పాటలకి అల్లు అరవింద్ , సాయి పల్లవి డాన్స్ వేయడం జరిగింది. ఈ వేదిక పైన హైలెస్సా.. హైలెస్సా అంటూ సాగేటువంటి పాటకి అల్లు అరవింద్ తో పాటు సాయి పల్లవి కలిసి డాన్స్ వేశారు. ఈ వీడియో ఇటు సాయి పల్లవి అభిమానులు, అల్లు అభిమానులు సోషల్ మీడియాలో తెగ వైరల్ చేశారు.
అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ బ్యానర్ పైన బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మించారు. అలాగే మరొక వీడియోలో నాగచైతన్య , సాయి పల్లవి స్టెప్పులతో కుమ్మేశారు.. ఈ చిత్రంలోని శివాయ అనే పాటకు సైతం అదిరిపోయే స్టెప్పులు వేస్తూ కనిపించారు సాయి పల్లవి, నాగచైతన్య.
దీన్ని బట్టి చూస్తూ ఉంటే తండేల్ సినిమా యూనిట్ సక్సెస్ ను ఫుల్ గా ఎంజాయ్ చేస్తూ ఉన్నట్టు కనిపిస్తోంది. ఇప్పటికే రూ.80 కోట్లకు పైగా.గ్రాస్ కలెక్షన్స్ రాబట్టిన చిత్రం రాబోయే రోజుల్లో రూ.100 కోట్ల చేరువలో చేరబోతోందని చెప్పవచ్చు.. మరి మొదటిసారి నాగచైతన్య రూ. 100 కోట్ల క్లబ్ లోకి అడుగు పెట్టబోతున్నారు.
ఇదీ చదవండి: అల్లు అర్జున్ నిజంగానే రామ్ చరణ్ అన్ ఫాలో చేశాడా.. తెర వెనక అసలు స్టోరీ ఇదే..
ఇదీ చదవండి: తాగుడుకు బానిసై సినీ కెరీర్ నాశనం.. 44 ఏళ్ల వయసులో స్టార్ హీరోయిన్ రెండో పెళ్లి..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.