Brahma Anandam Collections: ఫిబ్రవరి 14 వాలెంటైన్స్ డే సందర్భంగా యంగ్ హీరో విశ్వక్ సేమ్ తొలిసారి లేడీ గెటప్ లో నటిస్తూ ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం లైలా. వాలెంటైన్స్ డే సందర్భంగా విడుదలైన ఈ సినిమా ఘోర డిజాస్టర్ ను చవిచూసింది. భారీ అంచనాల మధ్య ఫిబ్రవరి 14న విడుదలైన ఈ సినిమాలలో ఆకాంక్ష శర్మ హీరోయిన్గా నటించగా, రామ్ నారాయణ్ దర్శకత్వం వహించగా సాహు గారపాటి నిర్మించారు.
ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన పోస్టర్ టీజర్ ట్రైలర్ అన్ని కూడా సినిమాపై అంచనాలను పెంచేసాయి. అంతేకాదు ఈ సినిమా ఈవెంట్ కి మెగాస్టార్ చిరంజీవి కూడా ముఖ్యఅతిథిగా వచ్చారు. కానీ ఏవీ కూడా సినిమాను విజయవంతం చేయలేకపోయాయి. దీంతో పూర్తి స్థాయిలో నిరాశపడ్డారు అని చెప్పవచ్చు.
ఇక మరొకవైపు బ్రహ్మానందం తన కుమారుడు గౌతమ్ రాజా తో కలిసి బ్రహ్మ ఆనందం అనే సినిమా చేశారు. ఈ సినిమా కూడా వాలెంటైన్స్ డే సందర్భంగా నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా ప్రేక్షకులను బాగా మెప్పించింది.
కానీ ఈ రెండు చిత్రాలు ఒక సినిమా వల్ల భారీగా ఇబ్బంది పడుతున్నట్లు సమాచారం.
అసలు విషయంలోకెళితే,బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించిన ఆరెంజ్ సినిమా 2010లో థియేటర్లలో విడుదలై బాక్సాఫీస్ భారీ డిజాస్టర్ ను చవిచూసింది. కానీ ఈ సినిమాను మళ్ళీ కొన్నేళ్ల తర్వాత రీ రిలీజ్ చేయడంతో నాగబాబుకు భారీగానే లాభాలు వచ్చాయి. అయితే ఇప్పుడు మళ్లీ ఇండస్ట్రీలోకి ఈ సినిమా విడుదలై 15 సంవత్సరాలైనా తర్వాత నిన్న అనగా ఫిబ్రవరి 14న సినిమాను విడుదల చేశారు.
ఇకపోతే పవర్ స్టార్ రామ్ చరణ్ మెగా అభిమానులలో ఆరెంజ్ పట్ల ఉన్న క్రేజ్ ను పునరుద్ఘాటించే భారీ ఫీట్ లో ఆరెంజ్ సినిమా అడ్వాన్స్ బుకింగ్లు జరిగాయి. ముఖ్యంగా వాలెంటైన్స్ డే సందర్భంగా విడుదలైన లైలా, బ్రహ్మ ఆనందం రెండింటి ప్రీ సేల్స్ ను అధిగమించింది ఆరెంజ్. ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ అంతటా సింగిల్ స్క్రీన్లు అలాగే మల్టీప్లెక్స్ లలో ఆరెంజ్ సినిమా చాలా షోలు అమ్ముడుపోయాయి. దీంతో లైలా, బ్రహ్మ ఆనందం సినిమాలకు భారీ నష్టం కలుగుతుందని చెప్పవచ్చు.
ఇదీ చదవండి: వై టార్గెట్ చిరంజీవి.. ? మెగా ఫ్యామిలీని కావాలనే టార్గెట్ చేశారా..?
ఇదీ చదవండి: అల్లు అర్జున్ నిజంగానే రామ్ చరణ్ అన్ ఫాలో చేశాడా.. తెర వెనక అసలు స్టోరీ ఇదే..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.