మూవీ రివ్యూ: పట్టుదల (Pattudala)
తారాగణం: అజిత్ కుమార్, యాక్షన్ కింగ్ అర్జున్, త్రిష, రెజీనా, ఆరబ్, నిఖిల్ నారాయణ్, రవి రాఘవేంద్ర, జీవా రవి తదితరులు
సంగీతం: అనిరుథ్ రవిచంద్రన్
సినిమాటోగ్రఫీ: ఓం ప్రకాష్
ఎడిటర్: ఎన్.బి.శ్రీకాంత్
బ్యానర్: లైకా ప్రొడక్షన్స్
నిర్మాత: సుభాస్కరన్
దర్శకత్వం: మగిల్ తిరుమేణి
విడుదల తేది: 6-2-2025
అజిత్ కుమార్ తమిళంలో హిట్ ఫ్లాపులతో సంబంధం లేకుండా అగ్ర హీరోగా సత్తా చాటుతున్నాడు. కేవలం హీరోగానే కాకుండా ఫార్ములా వన్ కార్ రేసర్ గా తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. తాజాగా కేంద్రం ఈయన సేవలను గుర్తించి పద్మభూషణ్ తో గౌరవించింది. ఆ సంగతి పక్కన పెడితే.. అజిత్ కుమార్ మగిల్ తిరుమేణి దర్శకత్వంలో ‘పట్టుదల’ మూవీతో పలకరించారు. తమిళంలో ‘విడాముయార్చి’ టైటిల్ తో విడుదలైంది. ఈ రోజు థియేట్రికల్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఆడియన్స్ ను అట్రాక్ట్ చేసిందా.. లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం.
కథ విషయానికొస్తే..
అర్జున్ (అజిత్ కుమార్) అజర్ బైజాన్ రాజధాని బకులో ఓ బడా కంపెనీలో పనిచేస్తూ అక్కడ తన భార్య కాయల్ (త్రిష) సెటిలవుతాడు. ఇక పెళ్లైన 12 యేళ్ల తర్వాత వీళ్లిద్దరు విడిపోవాలనుకుంటారు. ఈ క్రమంలో కాయల్ తన పుట్టింటికి వెళ్లాలనుకుంటోంది. అయితే.. చివరి సారిగా భార్యను తనే వాళ్ల పుట్టింట్లో దింపుతా నంటాడు. ఈ క్రమంలో వీళ్లిద్దరు కలిసి బకు నుంచి అజార్ బైజాన్ లో ఉంటున్న కాయల్ పుట్టింటికి బయలు దేరుతారు. మార్గమాధ్యంలో వాళ్లకు రక్షిత్ (అర్జున్), దీపికా (రెజీనా) పరిచయం అవుతారు. అయితే దారిలో అర్జున్ కారు ట్రబుల్ ఇస్తుంది. అదే దారిలో వెళుతున్న రక్షిత్, దీపికా అతని భార్యను ఆన్ ది వేలో ఓ రెస్టారెంట్ లో దింపి .. మెకానిక్ ను పంపిస్తానంటారు. భార్యను వాళ్లతో పంపిస్తాడు. ఆ తర్వాత చూస్తే అతని కారులో వైర్లను ఎవరో కట్ చేసి కావాలని పాడయ్యేలా చేసారనే సంగతి గుర్తిస్తాడు. ఆ తర్వాత కారును బాగు చేసుకొని వాళ్లు చెప్పిన రెస్టారెంట్ దగ్గరకు వెళితే.. అక్కడ అతని భార్య ఉండదు. రక్షిత్, దీపికాలు ఉండరు. ఇంతకీ అర్జున్ భార్యను రక్షిత్, దీపికాలు కిడ్నాప్ చేస్తారు. వాళ్ల చెర నుండి తన భార్యను విడిపించుకోవడానికి పట్టుదలతో ఎలాంటి ప్రయత్నాలు చేసాడు. ఈ క్రమంలో జరిగిన పరిణామాలేమిటనేదే ‘పట్టుదల’ మూవీ స్టోరీ.
కథనం, టెక్నికల్ విషయానికొస్తే..
దర్శకుడు మగిల్ తిరుమేణి.. 1997లొ హాలీవుడ్ లో వచ్చిన ‘బ్రేక్ డౌన్’ మూవీని యథాతథంగా మక్కీ మక్కీ హాలీవుడ్ మార్క్ టేకింగ్ తో దింపేసాడు. అజిత్ స్వాగ్ ను.. అర్జున్ యాక్షన్ ను సమపాళ్లలో ఉపయోగించుకున్నాడు. ముఖ్యంగా సినిమా స్టారింగ్ లో హీరో, హీరోయిన్ మధ్య ప్రేమ, పెళ్లి వంటి వాటితో సాగదీసాడు. వాటిని కాస్త ట్రిమ్ చేసి డైరెక్ట్ గా కథలో ఎంట్రీ ఇచ్చి ఉంటే బాగుండేది. ముఖ్యంగా అజిత్ ను డేట్స్ దొరకాయని ఈ సినిమాను చుట్టేయకుండా.. ప్రతి సీన్ తర్వాత నెక్ట్స్ సీన్ లో ఏం జరుగుతుందో అని ఉత్కంఠ రేపాడు. మొత్తంగా అజిత్ హీరోయిజాన్ని.. అర్జున్ లోని యాక్షన్ ను యూజ్ చేసుకున్నాడు. కానీ ఈ సినిమా సగటు మాస్ ప్రేక్షకులను మెప్పించడం ఒకింత కష్టమే అని చెప్పాలి. మొత్తం సినిమా అంతా మనకు తెలియని అజర్ బైజన్ లో జరగడం. ఏదో హాలీవుడ్ మూవీ చూస్తున్నట్టు మధ్యలో సబ్ టైటిల్స్ కొంచెం చిరాకు తెప్పిస్తాయి. ముఖ్యంగా ఇంటర్వెల్ తర్వాత కారులో విలన్స్ తో ఫైట్ మాస్ ను ఆకట్టుకుంటాయి. ఇక అజిత్ ఇంటర్వెల్ ముందు వరకు విలన్స్ చేతిలో తన్నులు తినడం వంటివి కామన్ సినీ ప్రేమికులకు నచ్చకపోవచ్చు. కానీ అజిత్ హీరోయిజం అనేది పట్టించుకోకుండా నటించడం బాగుంది. ముఖ్యంగా అజిత్ విలన్స్‌తో చేస్తున్న యాక్షన్ సీన్స్ ప్రేక్షకులకు గూస్ బంప్స్ తెప్పిస్తాయి.
ముఖ్యంగా అజర్ బైజాన్‌లో పిక్చరైజ్ చేసిన యాక్షన్ సీక్వెన్స్‌లు అట్రాక్టివ్ గా ఉన్నాయి. మరో వైపు యాక్షన్ కింగ్ అర్జున్ ఓ వైపు జైలులో ఖైదీగా, మరోవైపు స్టైలిష్ లుక్‌లో మంచి నటన కనబరిచారు. సైకో విలన్ గా ఇరగదీసాడు. ‘మంగత్తా’ సినిమా తర్వాత అర్జున్, అజిత్ మరోసారి కలిసి ఈ ినిమా నటించారు. రెజీనా కసాండ్ర సైతం ఇప్పటి వరకు చేయనటువంటి వైవిధ్యమైన పాత్రలో మెప్పించింది. ఇక అజిత్, త్రిష మధ్య కెమిస్ట్రీ బాగుంది. ఫస్ట్ హాఫ్ లో అజిత్, త్రిష ల లవ్ స్టోరీ ఇంకాస్త ట్రిమ్ చేసుంటే బాగుండేది. సినిమాటోగ్రఫీ, నిర్మాణ విలువలు బాగున్నాయి.
ఇదీ చదవండి: గడ్డకట్టే చలిలో నాగ సాదువులు నగ్నంగానే ఎందుకు ఉంటారు.. అసలు రహస్యం అదేనా..!
ఇదీ చదవండి : చిరంజీవి, కీర్తి సురేష్ తల్లితో రొమాన్స్ చేసిన ఈ సినిమా తెలుసా..! అందులో మెగాస్టార్ విలన్..=
నటీనటుల విషయానికొస్తే..
అజిత్ మరోసారి తనకు అచొచ్చిన సాల్ట్ అండ్ పెప్పర్ స్టైలిష్ లుక్ లో అదరగొట్టాడు. ఫ్లాష్ బ్యాక్ లో నల్ల జుట్టుతో కనిపించి ప్రేక్షకులన సర్ప్రైజ్ చేశారు. యాక్షన్ సీన్స్ లో అదరగొట్టేసాడు. అర్జున్ మరోసారి యాక్షన్ కింగ్ గా తన పవరేంటో చూపించాడు. రెజీనా ఇప్పటి వరకు తన కెరీర్ లో చేయనటువంటి నెగిటివ్ షేడ్ పాత్రలో మెప్పించింది. త్రిష ఫస్ట్ హాఫ్ వరకు కొన్ని సీన్స్ కే పరిమితమైంది.
ప్లస్ పాయింట్స్
అజిత్, అర్జున్ ల పోటా పోటీ నటన
పోరాట సన్నివేశాలు
నిర్మాణ విలువలు
మైనస్ పాయింట్స్
అజిత్, త్రిషల లవ్ స్టోరీ
ఎడిటింగ్
రొటీన్ క్లైమాక్స్
రేటింగ్: 2.5/5
పంచ్ లైన్.. అజిత్ ‘పట్టుదల’ అక్కడక్కడా మెప్పిస్తుంది..
ఇదీ చదవండి : ప్రస్తుత మార్కెట్ వాల్యూ ప్రకారం నాగార్జున ‘అన్నపూర్ణ స్టూడియో’ మార్కెట్ విలువ ఎంతో తెలుసా..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.