Naga Chaitanya: నాగచైతన్య, శోభిత చేసిన పనికి ప్రశంసల జల్లు..!

Naga Chaitanya Sobhita: నాగచైతన్య, శోభిత.. ఈ మధ్యనే పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఎంతోమంది వీరిద్దరికి ఆశీర్వాదాలు అందజేయగా.. కొంతమంది మాత్రం వీరిపై ఎన్నో నెగటివ్ కామెంట్స్ చేస్తూ ఉండడం మనం చూస్తూనే ఉన్నాము. ఈ క్రమంలో వీరిద్దరూ చేసిన పనికి అందరూ కూడా జైజై అంటున్నారు.

Written by - Vishnupriya Chowdhary | Last Updated : Feb 22, 2025, 06:05 PM IST
Naga Chaitanya: నాగచైతన్య, శోభిత చేసిన పనికి ప్రశంసల జల్లు..!

Netizens Praise Naga Chaitanya and Sobhita: అక్కినేని నటుడు నాగచైతన్య, శోభిత ధూళిపాళ అనుసరించిన.. పని ఒకటి ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవల వివాహం చేసుకున్న ఈ జంట, క్యాన్సర్ బాధిత చిన్నారులకు సహాయంగా ముందుకు వచ్చారు.  

హైదరాబాద్‌లోని సెయింట్ జ్యూడ్ ఇండియా చైల్డ్ కేర్ సెంటర్‌ను సందర్శించి, అక్కడ ఉన్న పిల్లలకు అండగా నిలిచారు. చిన్నారులతో స్నేహంగా గడిపి, వారితో నవ్వులు పంచుకున్నారు. కేవలం బహుమతులు అందించడమే కాకుండా, వారితో కలిసి సరదాగా గడిపారు. ఈ వీడియోలు, ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.  

నెటిజన్లు ఈ జంటను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. తమ అభిమానం వ్యక్తం చేస్తూ, మంచి మనసు చాటుకున్న నాగచైతన్య-శోభితను అభినందిస్తున్నారు.  

కాగా సమంతకు విడాకులు ఇచ్చి శోభిత అని నాగచైతన్య పెళ్లి చేసుకోగా.. కొంతమంది నిన్న, మొన్నటి వరకు వీరిద్దరిపైన నెగటివ్ కామెంట్స్ చేస్తూ ఉండడం మనం చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా వీరిద్దరి వల్ల సమంత చాలా బాధపడింది అంటూ కూడా కామెంట్లు వినిపించాయి. ఈ విషయాలన్నీ పక్కన పెడితే ఎప్పుడు మాత్రం మీరిద్దరూ చేసిన పనిని అందరూ మెచ్చుకుంటున్నారు.

ఇక సినీ విషయాలకు వస్తే, నాగచైతన్య తాజా చిత్రం ‘తండేల్’ బ్లాక్‌బస్టర్ హిట్ సాధించింది. ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్గా.. నటించగా దేవిశ్రీప్రసాద్ సంగీతం హైలెట్గా నిలిచింది. మత్స్యకారుల జీవిత నేపథ్యంతో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమా నాగచైతన్య కెరియర్ లోనే అత్యధిక కలెక్షన్ సాధించిన సినిమాగా నిలిచింది. ఈ సినిమా తర్వాత ఈ హీరో ఎలాంటి సినిమా ఎంచుకుంటారు అనే దానిపై కూడా ఆసక్తి నెలకొంది. మరోపక్క శోభిత పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉంటూనే, సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్‌గా కొనసాగుతున్నారు.  

ఈ క్రమంలో ఈ జంట మరిన్ని సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారా? అనేది చూడాలి.

 

Also Read: APPSC Group 2 Mains: రేపే ఏపీ గ్రూపు 2 పరీక్ష.. వాయిదా కోసం నిరుద్యోగుల ఆందోళన ఉధృతం

Also Read: IPS Officers: తెలంగాణ ఐపీఎస్‌ అధికారులకు షాక్‌.. ఏపీలో రిపోర్ట్‌ చేయాలని ఆదేశం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News