Ajith kumar faces road accident in spain video: కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ మరోసారి ప్రమాదానికి గురయ్యారు. ఆయన స్పెయిన్ లో కారు రేసింగ్ లో పాల్గొన్నారు. ఈక్రమంలో మరో కారును తప్పించే ఘటనలో హీరో అజిత్ కారు అదుపు తప్పింది. వెంటనే అది పల్టీలు కొట్టుకుంటూ వెళ్లి ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదం జరగ్గానే అక్కడున్న టీమ్ వెంటనే పరుగున అక్కడికి చేరుకుని హీరోను సెఫ్టీగా బైటకు తీశారు. ఆయనను మరో కారులో షిఫ్ట్ చేశారు.
అప్పటికే అక్కడికి చేరుకున్న సిబ్బంది అజిత్ కు ఎక్కడైన దెబ్బలు తగిలాయా.. అని కంప్లీట్ గా చెక్ చేశారు. ఆయనకు ఎలాంటి దెబ్బలు తగల్లేదని అక్కడున్న వారు గుర్తించారు. అయితే.. అజిత్ కుమార్ గతంలో కూడా దుబాయ్ లో రేసింగ్ కు వెళ్లినప్పుడు ఇదే విధంగా కారు ప్రమాదానికి గురయ్యారు. అప్పుడు కూడా.. ఆయన వెంట్రుకవాసిలో ప్రమాదం నుంచి బైటపడ్డారు.
వెంటనే అప్పుడు కూడా.. కారు పల్టీలు కొట్టి ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. అయితే.. హీరో అజిత్ కుమార్ నెలల వ్యవధిలోనే మరోసారి అచ్చం కారు రేసింగ్ లోనే మరోసారి ప్రమాదానికి గురవ్వడంతో అభిమానులు ఆందోళనకు గురౌతున్నారు. అయితే.. అజిత్ కుమార్ ఒక వైపు సినిమాలు చేస్తునే మరోవైపు ఏ మాత్రం గ్యాప్ దొరికిన కూడా.. వెంటనే రేసింగ్ లలో పాల్గొంటున్నారు. ఆయనకు రేసింగ్ అంటే ఎంతో సరదా.
ముఖ్యంగా రేసింగ్ కోసం ఒక టీమ్ ను సైతం ఏర్పాటు చేసుకున్నారు. ఈ కారు ప్రమాదంకు చెందిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్గా మారింది. దీన్ని చూసిన అభిమానులు షాక్ అవుతున్నారు. మరికొందరు అజిత్ కు ఏదైన కారు గండం ఉందా.. ఏంటని కూడా డౌటానుమానం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు మాత్రం తమ అభిమాన హీరోకు ఏంకాలేదు తమకదే చాలని ఎమోషనల్ అవుతున్నారు. అయితే.. ఈ ప్రమాదంలో మాత్రం కారు పూర్తిగా తుక్కు తుక్కు అయ్యింది.