Chiranjeevi Says Jai Jenasena: విశ్వక్ సేన్ తాజాగా నటించినటువంటి చిత్రం 'లైలా'. ఈ సినిమాలో లేడీ గెటప్ లో కనిపించబోతున్నారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్నటి రోజున చాలా గ్రాండ్ గా జరిగింది. ముఖ్యంగా మెగాస్టార్ ముఖ్యఅతిథిగా రావడంతో లైలా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైలెట్గా నిలిచింది. అంతేకాకుండా చిరంజీవి గతంలో ఎన్నడూ లేని విధంగా పొలిటికల్ పరంగా ప్రజారాజ్యం, జనసేన అంటూ పలు కీలకమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది.
అలాగే విశ్వక్ సేన్ తండ్రి గురించి మాట్లాడుతూ.. కరాటే రాజు అనే వ్యక్తి 17 ఏళ్ల క్రితమే తనతో కలిసి ప్రజారాజ్యం పార్టీలో పని చేశారని తెలిపారు.. ఆ తర్వాత జై జనసేన అంటూ వెల్లడించారు. ఈ క్రమంలోనే ప్రజారాజ్యం.. ఇప్పుడు జనసేన గా మారిందని తెలిపారు. అంతేకాదు ప్రజారాజ్యం పార్టీనే జనసేనగా రూపాంతరం చెందింది అంటూ కూడా తెలియజేశారు. ఈ విషయం పైన తాను హ్యాపీగానే ఉన్నానని తెలియజేయడంతో అభిమానులు కూడా కేరింతలు పెట్టడం జరిగింది. అందుకు సంబంధించిన వీడియో కూడా వైరల్ గా మారుతోంది.
చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని 2008 ఆగస్టు 26న ప్రారంభించారు.. ప్రజారాజ్యంలో యువరాజ్యం విభాగానికి సైతం పవన్ కళ్యాణ్ న్యాయకత్వం వహిస్తూ ఉండేవారు.. అలా 2009లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సాధారణ ఎన్నికలు రాగా 294 స్థానాలలో 18 స్థానాలలో మాత్రమే ప్రజారాజ్యం పార్టీ గెలుపొందింది. మొత్తం మీద 18% ఓటింగ్ను కూడా సంపాదించుకున్నది.
ఇక చిరంజీవి తిరుపతి, పాలకొల్లు వంటి ప్రాంతాలలో పోటీపడినప్పటికీ కేవలం తిరుపతిలో మాత్రమే గెలిచారు. ఆ తర్వాత కొన్ని కారణాల చేత 2011లో కాంగ్రెస్ పార్టీలోకి ప్రజారాజ్యం పార్టీని విలీనం చేయడం జరిగింది. అలా కేంద్రమంత్రిగా కూడా చిరంజీవి పని చేశారు. లైలా సినిమా విషయానికి వస్తే.. విశ్వక్ సేన్ తొలిసారి లేడీ గెటప్ లో ప్రేక్షకులను అలరించబోతున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాపై అంచనాలు భారీగా మారిపోయాయి. దీనికి తోడు ఈ సినిమాకి ఏ సర్టిఫికెట్ కూడా సెన్సార్ బోర్డు జారీ చేసింది
Read more: Viral Video: పెళ్లిలో షాకింగ్ ఘటన.. డ్యాన్స్ చేస్తు స్టేజీ మీదనే కుప్పకూలీన యువతి.. వీడియో వైరల్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter