Chiranjeevi Controversy: మెగాస్టార్ చిరంజీవి తరచూ ఈ మధ్యకాలంలో చాలా రకాలుగా ట్రోల్ కి గురవుతున్నారు. నిన్నటి రోజున ఒక సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో చిరంజీవి మాట్లాడిన మాటలు చాలామందికి అసహ్యించుకునేలా ఉన్నాయి. ముఖ్యంగా చిరంజీవి తాతకు తన ఇంట్లో ఇద్దరు భార్యలు ఉన్నారని, బయట ఇంకొక చిన్న ఇల్లు కూడా ఉన్నదంటూ తెలియజేశారు.. ఈ విషయం విన్న అభిమానులే కాకుండా సినీ సెలెబ్రేటీలు కూడా ఆశ్చర్యపోతున్నారు.
మా అమ్మ గారి తండ్రి పేరు రాధాకృష్ణమనాయుడు.. ఈయన నెల్లూరు వాసి అయినప్పటికీ మొగల్తూరు లోనే స్థిరపడ్డారు.. స్టేట్ ఎక్సేంజ్ ఇన్స్పెక్టర్ గా కూడా రిటైర్డ్ అయ్యారు. ఆయన మహా రసికుడు.. నాకు ఇద్దరు అమ్మమ్మలు.. ఒకవేళ వీరిద్దరి మీద అలిగారంటే మరొక ఇంటికి వెళతారు.. అలా తనకు తెలిసి ముగ్గురు.. నాలుగు, ఐదో ఇల్లు కూడా ఉన్నాయేమో నాకు తెలీదు అంటూ తెలిపారు చిరంజీవి.
ఇండస్ట్రీకి వెళ్లేటప్పుడు మీ తాతను మాత్రం ఆదర్శంగా తీసుకోవద్దంటూ తనకు చాలామంది చెప్పారంటూ తెలిపారు చిరంజీవి. తాను మాత్రం తన తాతను ఆదర్శంగా తీసుకోలేదు, తన తాత రసికుడైనప్పటికీ కూడా చాలానే దానధర్మాలు చేసే వారిని, ఆ గుణం మాత్రం తనకి వచ్చిందంటూ వెల్లడించారు చిరంజీవి.
అలాగే చిరంజీవి తన ఇంట్లోనే ప్రస్తుతం తాను ఒక లేడీస్ వార్డెన్ లా ఉంటున్నానని చేసిన వ్యాఖ్యలు.. చాలామంది చేత చిరంజీవి ట్రోల్ చేసేలా కనిపిస్తున్నాయి.. ముఖ్యంగా రామ్ చరణ్ , ఉపాసనని ఒక అబ్బాయి కణాలని కోరానంటూ తెలిపారు చిరంజీవి. ఈ విషయం పైన కూడా మహిళా కమిషనర్ లు సైతం లింగ వివక్షత ఇలాంటివారు చూపిస్తే ఎలా అంటూ ఫైర్ అవుతున్నారు.
ప్రస్తుతం చిరంజీవి చేసిన ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ముఖ్యంగా ఈయన చేసిన మాటలను కొంతమంది సమర్థిస్తుంటే మరి కొంతమంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter