Daaku Maharaaj collections: నందమూరి బాలకృష్ణ, డైరెక్టర్ బాబి కాంబినేషన్లో వచ్చిన డాకు మహారాజ్ సినిమా జనవరి 12న విడుదలై ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో కలెక్షన్స్ ని రాబడుతోంది. సీనియర్ హీరోలలో ఇప్పటివరకు బాలయ్యని మించిన హీరో లేరు అన్నట్టుగా టాక్ వినిపిస్తోంది. బాలయ్యకు జోడిగా ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధ శ్రీనాథ్ వంటి వారు నటించారు. ఐదు రోజులలోనే 114 కోట్ల రూపాయలను రాబట్టి బాలయ్య కెరియర్ లోని అతిపెద్ద విజయంగా ఈ సినిమా నిలబడింది. ఈ నేపథ్యంలోనే ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించి హైదరాబాదులో విజయోత్సవ సభను నిర్వహించారు చిత్ర బృందం.
ముఖ్యంగా ఈ వేడుకలో బాలయ్య మాట్లాడుతూ.. తాను దైవాన్ని నమ్ముతానని, ముఖ్యంగా తల్లిదండ్రుల ఆశీర్వాదం కచ్చితంగా ఉండాలని, కళామతల్లి ఆశీర్వాదం ఇలా అన్ని కలిపితేనే ఒక డాకు మహారాజ్ అంటూ తెలిపారు.. ఈ చిత్రానికి పనిచేసిన ప్రతి ఒక్కరూ కూడా కృతజ్ఞతలని, ముఖ్యంగా తనలోని నటనను బయటకు తీసిన డైరెక్టర్ బాబి కి, నిర్మాతలకి కూడా కృతజ్ఞతలు తెలిపారు.
ముఖ్యంగా వీరందరూ కూడా తన అభిమానులు కావడం చాలా గర్వంగా ఉందని వెల్లడించారు. రాబోయే రోజుల్లో మరిన్ని సినిమాలు తీయాలనీ ఆశీర్వదించారు బాలయ్య. ఇక కలెక్షన్స్ గురించి మాట్లాడుతూ.. ఇతర దేశాల నుంచి కూడా మన చిత్రాలను చూసి ప్రశంసించే స్థాయికి తెలుగు సినిమా పరిశ్రమ ఎదిగిందని.. తన వరకు చూసుకుంటే నా రికార్డ్స్ అన్ని అన్ స్టాపబుల్, నా కలెక్షన్స్ అన్ని అన్ స్టాపబుల్, నా అవార్డ్స్ అన్నీ కూడా అన్ స్టాపబుల్.. ముఖ్యంగా నా సినిమా కలెక్షన్స్ అన్ని జెన్యూన్ గా వచ్చినవే అంటూ బాలయ్య చెప్పడం జరిగింది.
ఇకపోతే ఇది విన్న నెటిజెన్స్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ ను ఉద్దేశించి కామెంట్లు చేశారని కామెంట్లు చేస్తున్నారు. ముఖ్యంగా రామ్ చరణ్ మూవీ డిజాస్టర్ గా నిలిచింది. కానీ కలెక్షన్లు వచ్చినట్లు పోస్టర్లు వేస్తుంటే తాను ఈ విధంగా మాట్లాడి ఉంటాడు అంటూ కూడా కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం.
ఇదీ చదవండి: గడ్డకట్టే చలిలో నాగ సాదువులు నగ్నంగానే ఎందుకు ఉంటారు.. అసలు రహస్యం అదేనా..!
ఇదీ చదవండి : ప్రస్తుత మార్కెట్ వాల్యూ ప్రకారం నాగార్జున ‘అన్నపూర్ణ స్టూడియో’ మార్కెట్ విలువ ఎంతో తెలుసా..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.