Tollywood: ఇండస్ట్రీలో విషాదం.. గుండెపోటుతో నటుడు మృతి..!

Vijay Rangaraju : సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు అభిమానులను కలవరపాటుకు గురి చేస్తున్నాయి. ఈ క్రమంలోని ప్రముఖ సినీ నటుడు విజయ రంగరాజు మృతి చెందినట్లు సమాచారం. ఈ విషయం తెలిసి అటు సినీ పరిశ్రమ కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తోంది.

Written by - Vishnupriya Chowdhary | Last Updated : Jan 20, 2025, 12:58 PM IST
Tollywood: ఇండస్ట్రీలో విషాదం.. గుండెపోటుతో నటుడు మృతి..!

Vijay Rangaraju Death News: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఈ మధ్యకాలంలో వరుస విషాదాలు అభిమానులను కలవరపాటుకు గురి చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఒకరి తర్వాత మరొకరు మరణిస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు. కొంతమంది వృద్ధాప్యం కారణంగా కన్నుమూస్తే.. మరి కొంతమంది అనారోగ్య సమస్యలతో చికిత్స పొందుతూ మరణిస్తున్నారు. అలాంటివారిలో ప్రముఖ నటుడు విజయ రంగరాజు కూడా ఒకరు.

వారం క్రితం ఒక సినిమా షూటింగులో విజయ రంగరాజు గాయపడ్డారట. ట్రీట్మెంట్ కోసం ఆయన చెన్నైలోనే ఆసుపత్రికి వెళ్ళగా అక్కడే గుండెపోటుతో మరణించినట్లు సమాచారం..మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం. రాజ్ కుమార్ గా పేరు దక్కించుకున్న విజయ రంగరాజు చెన్నైలో ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ.. ఈరోజు ఉదయం గుండెపోటుతో మరణించారు.

వారం క్రితం హైదరాబాదులో ఒక సినిమా షూటింగ్లో ఆయన గాయపడ్డారు. ఈ నిమిత్తం ట్రీట్మెంట్ కోసం చెన్నైకి వెళ్లిన ఈయన.. అక్కడ ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటూ ఉండగా సడన్గా గుండెపోటు వచ్చి మరణించినట్టు వైద్యులు నిర్ధారించారు. ఇకపోతే ఈయనకు ఇద్దరూ కూతుర్లు ఎక్కువగా విలన్ గా, సహాయక పాత్రలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకునేవారు.

 1994లో వచ్చిన భైరవద్వీపం అనే చిత్రంతో తెలుగు పరిశ్రమకు పరిచయమయ్యారు విజయ రంగరాజు. ఆ తర్వాత యజ్ఞం సినిమాతో మంచి గుర్తింపు లభించింది. యజ్ఞం సినిమాలో హీరోగా గోపీచంద్ నటించగా.. విలన్ పాత్రలో విజయ రంగరాజు ఆకట్టుకున్నారు. తమిళ్, మలయాళం చిత్రాలలో కూడా నటించి ప్రేక్షకులను అలరించారు విజయ రంగరాజు.

ఇకపోతే ఈయనకు సినిమాలలోనే కాదు వెయిట్ లిఫ్టింగ్, బాడీ లిఫ్టింగ్ లో కూడా ప్రవేశం ఉంది. ఇక ఇప్పటికే చాలామంది అధిక బరువులు ఎత్తడం, అవసరానికి మించిన వ్యాయామాలు చేయడం వల్ల మరణించిన విషయం తెలిసిందే. మరి విజయ రంగరాజుకు ఇంత సడన్గా హార్ట్ ఎటాక్ రావడానికి అసలు కారణం ఏంటన్నది తెలియాల్సి వుంది.

ఇదీ చదవండి:   గడ్డకట్టే చలిలో నాగ సాదువులు నగ్నంగానే ఎందుకు ఉంటారు.. అసలు రహస్యం అదేనా..!

ఇదీ చదవండి : ప్రస్తుత మార్కెట్ వాల్యూ ప్రకారం నాగార్జున ‘అన్నపూర్ణ స్టూడియో’ మార్కెట్ విలువ ఎంతో తెలుసా..?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News