Post Office Schemes: రిటైర్మెంట్ తరువాత లేక నిర్ణీత వ్యవధిలో ఒకేసారి పెద్దమొత్తంలో డబ్బులు కావాలంటే పోస్టాఫీసు పధకాలు బెస్ట్ ఆప్షన్. ముఖ్యంగా ఈ పధకంలో మీరు ఇన్వెస్ట్ చేసిన మొత్తానికి మూడు రెట్లు పొందవచ్చు. అదెలాగో తెలుసుకుందాం.
పోస్టాఫీసు పధకంలో 5 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే మెచ్యూరిటీ తరువాత ఏకంగా 15 లక్షల రూపాయలు పొందవచ్చు. ఇంట్లో పిల్లల భవిష్యత్ కోసం లేదా ఇతర అవసరాల కోసం ఒకేసారి భారీ మొత్తంలో డబ్బులు అవసరం అనుకుంటే ఈ పథకం మంచి ప్రత్యామ్నాయం. దీనికోసం చాలామంది పబ్లిక్ ప్రోవిడెంట్ ఫండ్, సుకన్య సమృద్ధి యోజన వంటి పధకాల్లో పెట్టుబడి పెడుతుంటారు. వీటిలో ఇన్వెస్ట్ చేసినప్పుడు ఒకేసారి పెద్దమొత్తంలో నిధి సమకూర్చుకోవచ్చు. పోస్టాఫీసు టెర్మ్ డిపాజిట్ పధకాలైన ఫిక్స్డ్ డిపాజిట్లలో 5 ఏళ్లకు ఇన్వెస్ట్ చేస్తే మంచి ఫలితాలు పొందవచ్చు. మీరు పెట్టిన పెట్టుబడికి మూడు రెట్లు డబ్బులు పొందవచ్చు.
దీనికోసం మీురు మీకు సమీపంలోని ఏదైనా పోస్టాఫీసులో 5 లక్షల రూపాయలు ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఐదేళ్ల ఫిక్స్డ్ డిపాజిట్‌గా పెట్టుబడి చేయాలి. ఐదేళ్ల ఎఫ్‌డిపై పోస్టాఫీసు 7.5 వడ్డీ చెల్లిస్తుందగి. అంటే ఐదేళ్ల తరువాత మొత్తం డబ్బులు 7,24,974 రూపాయలు అవుతుంది. ఈ డబ్బుల్ని విత్ డ్రా చేయకుండా మరో ఐదేళ్లకు ఎఫ్‌డి చేయాలి. అంటే పదేళ్లకు వడ్డీ రూపంలో 5,51,175 రూపాయలు లభిస్తాయి. మొత్తం డబ్బులు 10,51,175 రూపాయలు అవుతుంది.
ఈ మొత్తం డబ్బుని మరో ఐదేళ్లకు ఇన్వెస్ట్ చేస్తే మొత్తం 15 ఏళ్లు అవుతుంది. 15 ఏళ్లు పూర్తయ్యాక మీరు ఇన్వెస్ట్ చేసిన 5 లక్షలపై వడ్డీ మొత్తం 10,24,149 రూపాయలు అవుతుంది. అంటే మొత్తం లెక్కేస్తే 15,24,149 రూపాయలు జమ అవుతాయి. అంటే 5 లక్షల రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే మూడు రెట్లు అధికంగా 15 లక్షల 24 వేలు పొందవచ్చు.
పోస్టాఫీసులో ఎఫ్‌డిలపై వడ్డీ రేట్లు టెన్యూర్‌ని బట్టి ఉంటుంది. 1 ఏడాది కాల వ్యవధితో ఎఫ్‌డీపై 69 శాతం వార్షిక వడ్డీ లభిస్తుంది. ఇక 2 ఏళ్ల ఎఫ్‌డీపై 7 శాతం వడ్డీ ఉంటుంది. ఇక మూడేళ్ల ఎఫ్ డి పై7.1 శాతం వడ్డీ ఉంటుంది. ఐదేళ్ల ఎఫ్‌డిపై 7.5 శాతం వడ్డీ ఉంటుంది.
Also read: Daaku Maharaaj OTT Date: బాలయ్య అభిమానులకు పండగ, డాకు మహారాజ్ ఓటీటీ తేదీ ఫిక్స్, ఎప్పుడంటే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి