School Holidays: సెలవులంటే చాలు విద్యార్ధులు ఎగిరి గంతేస్తుంటారు. అక్టోబర్ తరువాత మళ్లీ ఇప్పుడు డిసెంబర్ నెలలో భారీగా సెలవులున్నాయి. డిసెంబర్ నెలలో స్కూళ్లకు ఏకంగా 10 రోజులు వివిధ సెలవులున్నాయి. కొన్ని స్కూళ్లకు 7-8 రోజులు సెలవులున్నాయి. డిసెంబర్ నెలలో సెలవుల జాబితా ఓసారి చెక్ చేద్దాం.
స్కూళ్లు, కళాశాలలకు ప్రతి నెలా సెలవులు వస్తూనే ఉంటాయి. అక్టోబర్ నెలలో దసరా పేరుతో 10 రోజులు సెలవులు వచ్చాయి. ఇప్పుడు మళ్లీ క్రిస్మస్ సెలవులు రానున్నాయి. డిసెంబర్ నెలలో స్కూళ్లు , కళాశాలలకు మొత్తం 10 రోజుల వరకూ సెలవులుంటాయి. అయితే ఇవి స్కూల్‌ని బట్టి మారవచ్చు. సాధారణ స్కూళ్లకు డిసెంబర్ నెలలో 5 ఆదివారాలు సెలవులతో పాటు క్రిస్మస్ సెలవులు 5 రోజులుంటాయి. మొత్తం పది రోజులు స్కూళ్లు మూతపడనున్నాయి. క్రైస్తవ మెషినరీ స్కూళ్లకు అయితే క్రిస్మస్ సెలవులు 21 లేదా 22 నుంచి 27 వరకూ ఉంటాయి. విద్యాశాఖ కేలండర్ ప్రకారం స్కూళ్లకు డిసెంబర్ 23 నుంచి 27 వరకూ క్రిస్మస్ సెలవులున్నాయి.
ఇక వచ్చే నెల జనవరిలో కూడా పెద్దఎత్తున సెలవులున్నాయి. సంక్రాంతి సెలవులు 5-6 రోజులుంటాయి. జనవరి 13 నుంచి 17 వరకూ 5 రోజులు సెలవులున్నాయి. జనవరి 26 రిపబ్లిక్ డే సెలవుంది. ఇవి కాకుండా ఆదివారాలు సెలవు ఎలాగూ ఉంటుంది. మొత్తానికి డిసెంబర్, జనవరి వరుసగా రెండు నెలలు స్కూళ్లు, కళాశాలలకు పెద్దఎత్తున సెలవులున్నాయి.
Also read: Teacher Murder: ఏపీలో దారుణం.. గొడవను ఆపిన టీచర్‌ను చంపేసిన విద్యార్థులు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.