Houses for Poor: ఏపీ ప్రభుత్వం సంక్రాంతి కానుక ఇచ్చేందుకు సిద్ధమైంది. ప్రజలతో సంబంధాలు కొనసాగిస్తూ ఉండేందుకు ఆలోచిస్తోంది. ఇందులో భాగంగా మరో భారీ కార్యక్రమం చేపట్టనుంది. ఒకరు కాదు ఇద్దరు కాదు,,వేలు కాదు ఏకంగా లక్షమంది పేదలకు ఇళ్లు అందించే కార్యక్రమమిది. ఆ వివరాలు మీ కోసం.
ఏపీలోని కూటమి ప్రభుత్వం చేపట్టే ప్రతి సంక్షేమ పథకంలో ఎమ్మెల్యేలు, మంత్రుల్ని భాగస్వామ్యం చేస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ సహా అంతా పాల్గొంటున్నారు. ఇప్పుడు తాజాగా పేదల ఇళ్లను సిద్ధం చేస్తోంది. జనవరి 3వ తేదీన దాదాపుగా 1 లక్షమంది పేదలకు ఇళ్లుఇచ్చే కార్యక్రమం చేపట్టనుంది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో ఈ కార్యక్రమం అమలు కానుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా హాజరుకానున్నారు. ఇతర జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉప ముఖ్యమంత్రి పాల్గొనేలా కార్యక్రమం రూపకల్పన జరిగింది. పేదలకు ఇంటి తాళాలు ఇచ్చి కాస్సేపు వారితో గడపనున్నారు. లబ్దిదారులు ఏం కోరుకుంటున్నారో అడిగి తెలుసుకోనున్నారు.
ఏపీలో పేదల ఇళ్ల నిర్మాణం, టిడ్కో ఇళ్లపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగానే మన ఇళ్లు మన గౌరవం కార్యక్రమం అమలు చేయనుంది. ఇప్పటికే లబ్దిదారుల ఎంపిక కార్యక్రమం జిల్లాలవారీగా జరుగుతోంది. గత ప్రభుత్వ హయాంలో ప్రారంభించి సిద్ధమైన దాదాపు లక్ష ఇళ్లను గుర్తించారు. ఈ ఇళ్లకు సంబంధించిన పై పనుల్ని త్వరగా పూర్తి చేసే పనిలో పడ్డారు. ఇవి కాకుండా రాష్ట్రవ్యాప్తంగా మరో 6 లక్షల 40 వేల ఇళ్లను నిర్మించాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి ఆవాస్ యోజనలో భాగంగా ఏపీలో ఎన్టీఆర్ గృహ నిర్మాణ పధకం పేరుతో అందించనున్నారు.
ఇక పెండింగులో ఉన్న టిడ్కో ఇళ్లను పూర్తి చేయాలని నిర్ణయించింది. స్థలాలు లేని పేదలకు ఉచితంగా స్థలాలిచ్చే కార్యక్రమం చేపట్టనుంది. గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్ల స్థలం ఇవ్వనున్నారు. 2029 నాటికి 25 లక్షల ఇళ్లు ఇచ్చేందుకు ప్రభుత్వం ప్లాన్ చేసినట్టు సమాచారం. పేదలకు ఇళ్ల నిర్మాణం కార్యక్రమం ద్వారా ప్రజలకు చేరువయ్యేందుకు ప్రభుత్వం ఆలోచన చేస్తోంది.
Also read: AP Government: సంపద కోసం బాండ్లు అమ్మేస్తున్న ఏపీ ప్రభుత్వం, మరో 5 వేల కోట్లు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.