Vijayawada Metro: విజయవాడ మెట్రోకు శ్రీకారం, 91 ఎకరాల భూమి, 34 స్టేషన్లకు రూట్ ఖరారు, స్టేషన్లు ఎక్కడంటే

Vijayawada Metro: ఆంధ్రప్రదేశ్‌లో తొలి మెట్రో రైలుకు కార్యాచరణ ప్రారంభమైంది. మెట్రో రూట్ మ్యాప్‌ను ఖరారు చేసిన ఆంధ్రప్రదేశ్ మెట్రో రైల్ కార్పొరేషన్ భూసేకరణకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఏయే రూట్లు, ఏయే స్టేషన్లు ఉంటాయి, ఎంత భూమి సేకరించనున్నారో తెలుసుకుందాం.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Feb 11, 2025, 03:13 PM IST
Vijayawada Metro: విజయవాడ మెట్రోకు శ్రీకారం, 91 ఎకరాల భూమి, 34 స్టేషన్లకు రూట్ ఖరారు, స్టేషన్లు ఎక్కడంటే

Vijayawada Metro: ఏపీలో విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో మెట్రోకు ప్రభుత్వం సిద్ధమైంది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న విజయవాడ మెట్రోకు తొలి అడుగు పడింది. తొలి దశలో రెండు కారిడార్ల నిర్మాణ కోసం రూట్ మ్యాప్‌తో పాటు 91 ఎకరాల భూమి సేకరించేందుకు ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ సిద్ధమైంది. అందుకు సంబంధించిన ప్రతిపాదనలను ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్‌కు సమర్పించారు. 

విజయవాడ మెట్రో తొలి దశ కోసం ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ అధికారులు 91 ఎకరాల భూమిని సేకరించనున్నారు. తొలిదశలో రెండు కారిడార్లు ఉంటాయి. ఇందులో మొదటి కారిడార్ 26 కిలోమీటర్ల మేర ఉంటుంది. ఇది విజయవాడలోని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ బస్ స్టేషన్ నుంచి ప్రారంభమై..విజయవాడ రైల్వే స్టేషన్ కలుపుతూ ఏలూరు రోడ్డు మీదుగా రామవరప్పాడు జంక్షన్ చేరుకుంటుంది. అక్కడి నుంచి జాతీయ రహదారి మీదుగా గన్నవరం వరకూ వెళ్తుంది. 

ఎక్కెడెక్కడ స్టేషన్లు

ఈ కారిడార్‌లో గన్నవరం, యోగాశ్రమం, విమానాశ్రయం, వేల్పూరు, గూడవల్లి, చైతన్య కళాశాల, నిడమానూరు, ఎంబీటీ సెంటర్, ప్రసాదం పాడు, రామవరప్పాడు జంక్షన్ వరకూ జాతీయ రహదారిపై స్టేషన్లు ఉంటాయి. ఇక ఏలూరు రోడ్‌లోని ప్రవేశించాక గుణదల, పడవల రేవు, మాచవరం డౌన్, సీతారాంపురం సిగ్నల్, బీసెంట్ రోడ్, రైల్వే స్టేషన్, బస్ స్టేషన్ ఉంటాయి. 

ఇక రెండవ కారిడార్ 12.5 కిలోమీటర్లు ఉంటుంది. ఇది కూడా బస్ స్టేషన్ నుంచి ప్రారంభమై బందర్ రోడ్ , బెంజ్ సర్కిల్, ఆటోనగర్, కానూరు, పోరంకి మీదుగా పెనమలూరు వరకు ఉంటుంది. ఈ మార్గంలో బస్ స్టేషన్, బందర్ రోడ్, విక్టోరియా మ్యూజియం, ఇందిరాగాంధీ స్టేడియం, బెంజ్ సర్కిల్, ఆటోనగర్, అశోక్ నగర్, కృష్ణానగర్, కానూరు సెంటర్, తాడిగడప, పోరంకి, పెనమలూరు స్టేషన్లు ఉంటాయి. 

ఈ రెండు కారిడార్లలో కలిపి మొత్తం 34 మెట్రో స్టేషన్లు ఉంటాయి. దీనికోసం కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో 91 ఎకరాల భూమి అవసరమౌతుంది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలు రెండు జిల్లాల కలెక్టర్లకు చేరాయి. 

Also read: Delhi CM Candidate: ఢిల్లీ ముఖ్యమంత్రిని ఖరారు చేసిన బీజేపీ అధిష్టానం, మాజీ జర్నలిస్టుకే అవకాశం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News