Free Gas Cylinder: ఏపీలో కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీల్లో భాగంగా ఇచ్చిన సూపర్ సిక్స్‌లో ముఖ్యమైంది. ఉచిత గ్యాస్ సిలెండర్ పథకం. గత ఏడాది దీపావళిలో లాంచ్ చేసిన ఈ పధకానికి సంబంధించి ఇప్పుడు మరో ప్రకటన విడుదల చేసింది. ఈ పధకం అందనివారికి శుభవార్త అందించింది. మరో అవకాశం కల్పిస్తోంది.
సూపర్ సిక్స్ హామీల్లో ఒకటైన ఉచిత గ్యాస్ సిలెండర్ పధకం గత ఏడాది దీపావళికి లాంచ్ అయింది. ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం చాలామంది దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఎవరైనా వివిధ కారణాలతో అప్లై చేసుకోకపోతే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. దీపం-2 పధకం కింద మరో అవకాశం కల్పిస్తోంది ఏపీ ప్రభుత్వం. అంటే మార్చ్ 31 వరకూ ఉచిత గ్యాస్ సిలెండర్ పథకం కోసం అప్లై చేసుకోవచ్చు. ప్రస్తుతం రాష్ట్రంలో ఈ పధకంలో భాగంగా 1.5 కోట్ల మంది లబ్దిదారులు ఉన్నారు. వీరంతా ఇప్పటికే 91,36,235 ఉచిత సిలెండర్లు బుక్ చేసుకున్నారు. 86,60,522 మందికి సబ్సిడీ డబ్బులు జమ అయ్యాయి. దీనికోసం ప్రభుత్వం 691 కోట్ల విడుదల చేసింది.
కేవలం వైట్ రేషన్ కార్డు ఉన్నవారికే ఈ పథకం వర్తిస్తుంది. వైట్ రేషన్ కార్డు లేకుంటే ఈ పధకం కోసం అప్లై చేయడానికి సాధ్యం కాదు. అయితే చాలామంది ధనికులు కూడా వైట్ రేషన్ కార్డు కలిగి ఉన్నారు. మరి వీళ్లు కూడా ఉచిత గ్యాస్ సిలెండర్లు పొందుతున్నారా లేదా అనేది స్పష్టత లేదు. మొత్తానికి ఈ పథకం దుర్వినియోగం మాత్రం జరుగుతోందనే విమర్శలు వస్తున్నాయి. అర్హత ఉండి ఇంకా దరఖాస్తు చేసుకోకపోతే మార్చ్ 31 వరకూ అవకాశం కల్పిస్తోంది ప్రభుత్వం. ఈ పధకం ప్రారంభమై 4-5 నెలలు అయినా ఇంకా చాలామంది అప్లై చేసుకోలేదు. రెండో విడతలో ఇప్పటి వరకూ 16 లక్షలమంది కొత్తగా అప్లై చేసుకున్నారు.
Also read: Jio AirFiber Plan: 599 రూపాయలకే 12 ఓటీటీలు, 800 టీవీ ఛానెళ్లు, ఎలాగో తెలుసా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి