Ind vs Pak match latest updates in pics: టీ20 వరల్డ్ కప్ 2021 లో భాగంగా ఈ నెల 24న, ఆదివారం నాడు భారత్, పాకిస్థాన్ జట్లు ఒకదానినొకటి ఢీకొనబోతున్నాయి. ఈ మ్యాచ్ కోసం భారత్, పాకిస్థాన్ జట్లు ఆటగాళ్లను ఆయుధాలు సిద్ధం చేసినట్టు చేస్తున్నాయి. భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ అంటే.. ఈ రెండు దేశాల క్రికెట్ ప్రియులే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ ప్రియులకు కన్నుల పండుగ లాంటిది అని అంటుంటారు.
Jasprit Bumrah, fastest Indian pacer to claim 100 Test wickets: లండన్‌లోని ఓవల్ మైదానం వేదికగా జరిగిన నాలుగో టెస్ట్ మ్యాచ్‌లో బుమ్రా మొత్తం 4 వికెట్లు తీసిన సంగతి తెలిసిందే. ఈ నాలుగు వికెట్లతో టెస్ట్ కెరీర్లో వేగంగా 100 వికెట్లు తీసిన ఆటగాడిగా జస్ప్రిత్ బుమ్రా రికార్డ్ సొంతం చేసుకున్నాడు.
WTC Final 2021 Team India Practice: మరో 8 రోజుల్లో ప్రతిష్టాత్మక ఐసీసీ డబ్ల్యూటీసీ ఫైనల్ ఫ్రారంభం కానుందని తెలిసిందే. సౌతాంప్టన్ వేదికగా జూన్ 18న న్యూజిలాండ్, టీమిండియా జట్ల మధ్య అసలుసిసలైన పోరు మొదలవుతుంది.
Ambati Rayudu’s Six breaks fridge glass: అంబటి రాయుడు మరోసారి తన సత్తా చాటుకున్నాడు. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో శనివారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన ఐపిఎల్ మ్యాచ్‌లో 27 బంతుల్లో 72 పరుగులు ( 4 ఫోర్లు, 7 సిక్సులు) చేసి నాటౌట్‌గా నిలిచి తనలో పర్ఫార్మెన్స్కి ఇంకా కొదువ లేదనిపించుకున్నాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి చెన్నై సూపర్ కింగ్స్ జట్టు (Chennai Super Kings) 218 పరుగుల భారీ స్కోర్ చేసి ముంబై ఇండియన్స్‌కి (Mumbai Indians) భారీ లక్ష్యాన్ని విధించింది.
ఏప్రిల్ 9న ఐపీఎల్ 2021 ప్రారంభం కానుంది. 5 టైటిల్స్ సాధించి ఐపీఎల్లో విజయవంతమైన జట్టుగా ముంబై ఇండియన్స్ నిలిచింది. డిఫెండింగ్ చాంపియన్‌గా ముంబై ఇండియన్స్ మరోసారి బరిలో దిగుతోంది. ఏప్రిల్ 9న తమ తొలి మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరును ఢీకొట్టనుంది.
టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రిత్ బుమ్రా ప్రేమ వివాహం చేసుకున్నాడు. స్పోర్ట్స్ ప్రజెంటర్ సంజనా గణేశన్, బుమ్రాల పరిచయం ప్రేమగా మారింది. పెద్దలను ఒప్పించి వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. గత కొన్ని రోజులుగా బుమ్రా వివాహం క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్ అవగా, మార్చి 15న సంజనా గణేశన్, జస్ప్రిత్ బుమ్రాలు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వీరి పెళ్లి పొటోలు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్నాయి.
టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రిత్ బుమ్రా ఓ ఇంటివాడయ్యాడు. స్పోర్ట్స్ ప్రజెంటర్ సంజనా గణేశన్‌ను క్రికెటర్ బుమ్రా వివాహం చేసుకున్నాడు. గత కొన్ని రోజులుగా బుమ్రా వివాహం క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. తాజాగా వివాహ బంధంతో జస్ప్రిత్ బుమ్రా, సంజనా గణేశన్ కొత్త జీవితంలోకి అడుగుపెట్టారు. వీరి పెళ్లి పొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. (Photos Credit: Twitter)
టీమ్ ఇండియా ( Team india) క్రికెటర్ జస్ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah)తెలుసు కదా. ఇటీవలే గోవాలో స్పోర్ట్స్ యాంకర్ సంజనా గణేశన్ (Sanjana Ganesan)తో ప్రేమలో పడ్డాడు. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాడు. ఈ నేపధ్యంలో టీవీ యాంకర్లతో ప్రేమించి పెళ్లిచేసుకున్న ఐదుగురు అంతర్జాతీయ క్రికెటర్ల గురించి తెలుసుకుందామా..
Jasprit Bumrah Wife Name కోసం టీమిండియా ప్రేక్షకులు, క్రికెట్ ప్రేమికులు గూగుల్‌లో తెగ వెతుకుతున్నారు. టీమిండియా పేసర్ జస్ప్రిత్ బుమ్రా పెళ్లి ప్రకటన కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Jasprit Bumrah To Miss Entire ODI Series Against England: ఇదివరకే ఇంగ్లాండ్‌తో జరగాల్సిన 5 టీ20ల సిరీస్‌కు ఇదివరకే బుమ్రాకు బీసీసీఐ విశ్రాంతి ఇచ్చింది. తాజాగా వన్డే సిరీస్‌కు అందుబాటులో ఉండటం లేదని ప్రకటించినట్లు సమాచారం.
India vs Australia 4th Test: Jasprit Bumrah Ruled Out Of Brisbane Test: ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియా ఆటగాళ్ల గాయాల పరంపరం కొనసాగుతోంది. మూడో టెస్టు అనంతరం రవీంద్ర జడేజా, హనుమ విహారి గాయాల కారణంగా సిరీస్ నుంచి వైదొలిగారు. ఈ జాబితాలో తాజాగా స్టార్ పేసర్ జస్ప్రిత్ బుమ్రా చేరాడు.
ముంబై ఇండియన్స్ ( Mumbai Indians ) మరోసారి అదరగొట్టింది. ఇప్పటికే నాలుగుసార్లు ఐపిఎల్ టైటిల్ సొంతం చేసుకున్న ముంబై ఇండియన్స్ జట్టు తాజాగా గురువారం జరిగిన క్వాలిఫయర్-1 మ్యాచ్‌లోనూ ఆల్ రౌండ్ ప్రదర్శనతో ఇరగదీసింది. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ( Delhi Capitals ) 57 పరుగుల తేడాతో ఓడించి ఫైనల్లో అడుగుపెట్టింది.
ప్రస్తుతం ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్ ఆడుతున్న టీమిండియా రేపటి 4వ టెస్ట్ మ్యాచ్‌కి సిద్ధమవుతోంది. నాలుగు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్ లో భాగంగా ఇప్పటికే మూడు మ్యాచ్ లు ఆడిన టీమిండియా.. అందులో 2 మ్యాచ్ లు గెల్చుకుని సిరీస్ లో పైచేయి సాధించింది. రేపటి నుంచి జరగనున్న టెస్ట్ మ్యాచ్ కూడా గెలిస్తే, సిరీస్ టీమిండియా వశమవడమేకాదు.. ఆస్ట్రేలియా గడ్డపై టెస్ట్ సిరీస్ గెల్చుకున్న టీమిండియా జట్టుగా కోహ్లీ సేన చరిత్ర సృష్టించనుంది. బుధవారంనాడు మీడియాతో మాట్లాడిన విరాట్ కోహ్లీని..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.