Worlds Expensive Rose: గులాబీలను పూలలో రాణిగా పిలుస్తారు. ప్రపంచవ్యాప్తంగా చాలా రకాల గులాబీలు ఉంటాయి. ఒక్కో ప్రాంతంలో లభించే గులాబీలకు చాలా విశిష్టత ఉంటుంది. కొన్ని గులాబీలు ధర చూస్తే మైండ్ బ్లాక్ అయిపోతుంది.
Worlds Expensive Rose: అలాంటిదే జూలియట్ రోజ్. ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనది. ఈ గులాబీని సామాన్యులు ఎవరూ కొనలేరు. కొనే సాహసం కూడా చేయరు. ఈ గులాబీ రూపకల్పనకు 15 ఏళ్లు పట్టిందంటారు.
గులాబీలు అందానికి ఆకర్షణకు ప్రతిరూపం. కొన్ని గులాబీలు చాలా ప్రత్యేకంగా ఉంటాయి.
ఫిబ్రవరి నెల అంటేనే ప్రేమకు సంబంధించిందంటారు. ప్రేమికులు అత్యంత ఘనంగా జరుపుకునే ప్రత్యేక రోజులు ఈ నెలలోనే ఉంటాయి. ఈ సందర్భంగా గులాబీలకు ఎక్కడ లేని డిమాండ్ ఉంటుంది.
కొన్ని గులాబీలు 20 -30 రూపాయలకు లభిస్తే మరికొన్ని వందల్లో పలుకుతాయి. ఇంకొన్ని గులాబీలు ఏకంగా వేలల్లో ధర పలుకుతాయి.
20-30 రూపాయలకు లేదా వందలు పలికే గులాబీలు సాధారణంగా ఎప్పుడూ చూసేవే. కానీ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన గులాబీ జూలియట్ రోజ్ గురించి చాలా మందికి తెలియదు. ఈ గులాబీ కొనే డబ్బులతో కొన్ని 10-20 ఇళ్లు కొనేయవచ్చు
ఈ జూలియట్ రోజ్ సాధారణమైంది కానే కాదు. ఈ గులాబీని పండించడం చాలా చాలా కష్టం. అందుకే అంత ధర
ఈ గులాబీని ప్రముఖ ఫ్లవరిస్ట్ డేవిడ్ ఆస్టిన్ పండించాడు. చాలా రకాల గులాబీలను కలిపి అనేక ప్రయోగాలు చేసిన తరువాత ఆప్రికాట్ హ్యూడ్ హైబ్రిడ్ అనే గులాబీ రకాన్ని అభివృద్ధి చేశాడు. దీనికి అతనికి 15 ఏళ్లు పట్టింది. 2006లో ఈ గులాబీ ఒక్కటి దాదాపుగా 90 కోట్లు పలికింది.
ఇది ఖరీదైందే కాకుండా చాలా ఆకర్షణీయంగా అందంగా ఉంటుంది. ఈ గులాబీ సువాసన ఇతర పూలకు విభిన్నంగా ఉంటుంది. ప్రస్తుతం ఈ గులాబీ ధర 130 కోట్లు ఉంది. ఈ గులాబీ ప్రత్యేకత ఏంటంటే మూడేళ్ల వరకు ఎండిపోదు.