Aadhaar card: మన దేశంలో 4 రకాల ఆధార్‌ కార్డులు ఉన్నాయని మీకు తెలుసా? ఇందులో మీకు ఏది బెస్ట్‌?

Types Of Aadhaar Card: మనదేశంలో ఎన్ని ఆధార్ కార్డులు అందుబాటులో ఉన్నాయి ?అందులో మీకు ఏది బెస్ట్? ఆధార్ కార్డు మనదేశంలో ఒక గుర్తింపు కార్డు. ఇది లేనిదే ఏ పని కాదు.. ఏ లావదేవీలు చేయలేము. బ్యాంకు నుంచి విద్యాలయాల వరకు ఆధార్ కార్డు తప్పనిసరి ఉండాల్సిందే. ఆధార్ కార్డులో ఒక వ్యక్తికి సంబంధించిన పేరు, పుట్టిన తేదీ, మొబైల్ నెంబర్, ఫోటో బయోమెట్రిక్ డీటెయిల్స్ ఉంటాయి. అయితే మన దేశంలో నాలుగు రకాల ఆధార్ కార్డులు ఉన్నాయి. అవి ఎవరికి సరిపోతాయి. 
 

1 /5

ఆధార్ కార్డు అనేది మన దేశంలో ఒక వ్యక్తి గుర్తింపు కార్డు. అతని పూర్తి వివరాలు అందులో పొందుపరిచి ఉంటాయి. బయోమెట్రిక్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. ఆధార్ కార్డు, పాన్ కార్డుతో మొబైల్ నెంబర్ మన బ్యాంకు ఖాతాకు లింక్ చేయాలి. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) ఈ ఆధార్ కార్డు జారీ చేస్తుంది  

2 /5

ఆధార్ లెట్టర్‌.. ఆధార్ లెట్టర్ అంటే పేపర్ లామినేట్ చేసిన డాక్యుమెంట్. దీనిపై క్యూఆర్ కోడ్ ఉంటుంది అందులో జారీ చేసిన తేదీ ఉంటుంది. ఇది ఆధార్ నమోదు చేసుకున్న వ్యక్తికి మెయిల్ ద్వారా అందిస్తారు. ఇందులో బయోమెట్రిక్, డెమోగ్రాఫిక్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. ఆధార్ లెట్టర్‌ పోగొట్టుకుంటే రూ. 50 ఛార్జ్ చేసి మళ్లీ కొత్తది జారీ చేస్తారు. వ్యక్తి అడ్రస్ కి పోస్టు ద్వారా పంపిస్తారు.

3 /5

ఇ ఆధార్.. ఇ ఆధార్ అంటే డిజిటల్ వెర్షన్‌లో ఉండే ఆధార్ కార్డు. ఇది కూడా ఎలక్ట్రానికల్ ఆధార్ కార్డు. ఇందులో క్యూఆర్ కోడ్ వెరిఫికేషన్ ఉంటుంది. పాస్వర్డ్ తో ప్రొటెక్ట్ చేస్తారు. ఇ ఆధార్ ని ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు.. లేకపోతే మాస్క్డ్ ఆధార్ కార్డు రెండిట్లో ఏదైనా మీరు డౌన్లోడ్ చేసుకునే సదుపాయం కల్పిస్తుంది. ఇందులో మొబైల్ నెంబర్ ద్వారా ఆధార్ ఎన్రోల్మెంట్ చేసుకోవాలి.

4 /5

mఆధార్.. స్మార్ట్ ఫోన్ వినియోగదారులకు పరిచయం చేసిందే mAadhaar. ప్రతి ఒక్కరు ఆధార్ కార్డుని ప్రదేశాలకు తీసుకువెళ్లలేరు.. కాబట్టి యూఐడీఏఐ ఈ సౌకర్యాన్ని కల్పించింది. స్మార్ట్ ఫోన్‌లో ఈజీగా ఎం ఆధార్‌ అందుబాటులోకి తీసుకువచ్చారు. ఇందులో కూడా ఆధార్ నెంబర్, డెమోగ్రాఫిక్ పూర్తి వివరాలు, ఫోటోగ్రాఫ్ కూడా ఉంటుంది. ట్యాంపర్ ప్రూఫ్, క్యూఆర్ కోడ్, ఆఫ్లైన్లో కూడా వెరిఫికేషన్ చేసుకోవచ్చు ఈ ఎం ఆధార్ వాలెట్ ప్రూఫ్ గా కూడా గుర్తించారు.

5 /5

ఆధార్ పీవీసీ కార్డు.. ఈ ఆధార్ పీవీసీ కార్డ్ అనేది లేటెస్ట్ వర్షన్ ఆధార్ కార్డు. ఇది పివిసి మెటీరియల్ తో తయారు చేసి ఆధార్‌ కార్డును. ఇందులో కూడా ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఫోటోగ్రాఫ్, డెమోగ్రాఫిక్ పూర్తి వివరాలు భద్రతతో తయారు చేస్తారు. ఆన్లైన్లోనే యుఐడిఐ వెబ్సైట్ ద్వారా రూ.50 పీవీసీ ఆధార్ కార్డుకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ  కార్డు మీ ఇంటికి నేరుగా పోస్ట్ ద్వారా డెలివరీ చేస్తారు