Gold Rate: పసిడి ప్రియులకు బిగ్ షాక్. బంగారం ధర ఆల్ టైం గరిష్టానికి చేరుకుంది. మొదటి సారిగా రూ. 89వేల మార్కు దాటేసింది. దీనికి తోడు వెండి ధరలు కూడా భారీగా పెరిగాయి. మరోసారి వెండి కిలో లక్ష రూపాయలు దాటేసింది.
Gold Rate: దేశంలో బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. ఒక్క రోజులోనే 13 వందల రూపాయలు పెరిగింది. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల బంగారం ధర రూ. 89. 400కు చేరుకుంది. గురువారం 10 గ్రాముల బంగారం ధర రూ. 88,100 దగ్గర ఉంది. అటు వెండి కూడా కిలో మళ్లీ లక్ష రూపాయల మార్క్ ను దాటేసింది. గురువారం 98వేలుగా ఉన్న వెండి ధర ఒక్కరోజులోనే 2వేలు పెరిగింది.
99.5శాతం స్వచ్చత కలిగి బంగారం ధర కూడా 1300 పెరిగి రూ. 89వేలకు చేరుకుంది. ప్యూచర్ మార్కెట్లో ఏప్రిల్ డెలివరీ బంగారం కాంట్రాక్ట్ పది గ్రాములకు రూ. 184 పెరిగి రూ. 85,993 వరకు చేరుకుంది.
అంతర్జాతీయంగా బంగారం ఔన్సు ధర నేడు అత్యధికంగా 2,960 డాలర్లకు చేరుకుంది. వెండి ఔన్సు 34 డాలర్లకు చేరింది. అమెరికా దిగుమతులపై ఛార్జీలు విధించే అన్ని దేశాలపై ప్రతీకార సుంకాలు విధిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడంతో ప్రపంచ వాణిజ్యాన్ని అనిశ్చితిలోకి నెట్టేసింది.
ఇప్పటికే చైనా వస్తువులపై సుంకాలు విధించింది అమెరికా. స్టీల్, అల్యూమినియం దిగుమతులపై టారిఫ్ లు విధిస్తామని ట్రంప్ పేర్కొన్నారు. అమెరికా అధ్యక్షుడి నుంచి వస్తున్న ఈ వరుస ప్రకటనల నేపథ్యంలో సురక్షిత పెట్టుబడి సాధనంగా భావించి బంగారం కొనుగోళ్లకు మదుపర్లు మొగ్గు చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే బంగారం ధరలు పెరుగుతున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.
MCXలో ఫ్యూచర్స్ ట్రేడింగ్‌లో ఏప్రిల్ డెలివరీకి సంబంధించిన బంగారం కాంట్రాక్టులు 10 గ్రాములకు రూ.184 పెరిగి రూ.85,993కి చేరుకున్నాయి. బలహీనమైన డాలర్ ఇండెక్స్, US టారిఫ్ విధానాల నుండి నిరంతర మద్దతు కారణంగా బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయని LKP సెక్యూరిటీస్‌లో కమోడిటీ & కరెన్సీ VP రీసెర్చ్ అనలిస్ట్ జతిన్ త్రివేది అన్నారు.
MCXలో బంగారం ధరలు పెరిగాయి. అయితే Comexలో బంగారం ధరలు ఔన్సుకు $2,935కి పెరిగాయి. ప్రస్తుతం అమెరికా రిటైల్ అమ్మకాలు, ప్రధాన రిటైల్ అమ్మకాల డేటాపై దృష్టి సారించామని, ఇది బంగారం తదుపరి కదలికను ప్రభావితం చేస్తుందని త్రివేది అన్నారు