Kumbh mela viral girl Monalisa: కుంభమేలలో పూసలమ్మే యువతి సోషల్ మీడియా పుణ్యామా.. అని ఓవర్ నైట్ లో ఫెమస్ అయిపోయింది. దీంతో ఆమెను ఇంటర్వ్యూ చేసేందుకు యూట్యూబ్ ఛానెల్స్, టీవీల వాళ్లు పోటీలు పడ్డారు. ఈక్రమంలో ఆమెకు ఏకంగా సినిమాలో చాన్స్ ఇస్తానని డైరెక్టర్ కూడా అక్కడికి వచ్చారు.
ప్రయాగ్ రాజ్ లో 144 ఏళ్ల తర్వాత మహా కుంభమేళ ఎంతో పండుగలా జరుగుతుంది. కోట్లాది మంది భక్తులు కుంభమేళకు వచ్చి త్రివేణి సంగమంలో పుణ్యస్నానాల్ని ఆచరిస్తున్నారు. ఈక్రమంలో కుంభమేళలో పూసలమ్మి జీవనం సాగించే యువతి తన తేనెకళ్లతో ఒక్కసారిగా ఫెమస్ అయిపోయింది.
ఆమెను ఇంటర్వ్యూ చేసేందుకు మీడియా వాళ్లు పోటీలు పడ్డారు. ఈ క్రమంలో కుంభమేళలకు వచ్చిన వారంత.. మోనాలీసాను చూసేందుకు, ఆమెతో ఫోటోలు దిగేందుకు ఎగబడ్డారు. దీంతో ఆమె చాలా ఫెమస్ అయిపోయింది. ఏకంగా దర్శకుడు సరోజ్ మిశ్రా.. తన తర్వాతీ సినిమా ది డైరీస్ ఆఫ్ మణిపూరీలో ఆమెను హీరోయిన్ గా తీసుకుంటున్నట్లు చెప్పారు.
దీనికోసం తన సొంత ఖర్చులతో ట్రైనింగ్ కూడా ఇప్పిస్తానని చెప్పాడు. ఇటీవల మోనాలీసా ఒక జ్యూవెల్లరీ షోరుంను ప్రారంభించింది. ఎయిర్ పోర్ట్ లో భోజనం చేసింది. తన కుటుంబంతో కలిసి ఫైవ్ స్టార్ హోటల్ లో భోజనం చేసింది. మోనాలీసా తమ కంపెనీ బ్రాండ్ గా ఉండాలని.. అనేక కంపెనీలు ఆమెతో డీల్ కూడా కుదుర్చుకున్నాయి.
ఈ క్రమంలో మోనాలీసా డెంజర్ లో ఉందని, ఆమెతో సినిమా తీస్తానన్న సనోజ్ మిశ్రా దగ్గర అంత డబ్బులు లేవని.. ప్రొడ్యూసర్ జితేంద్ర నారయణ్ బాంబు పేల్చారు. అంతే కాకుండా.. ఆమె వల్లో మోనాలీసా చిక్కుకుందని అన్నారు. కేవలంలో దర్శకుడు లైమ్ లైట్ లో ఉండేందుకు మోనాలీసా ఫెమ్ ను ఉపయోగించుకున్నాడని కాంట్రవర్సీగా మాట్లాడారు.ఈ వ్యాఖ్యలు దుమారంగా మారాయి.
దీనిపై సోషల్ మీడియాలో పెద్ద రచ్చ నడుస్తొంది. ఈ క్రమంలో దీనిపై మోనాలీసా క్లారిటీ ఇచ్చారు. సనోజ్ మిశ్రాతనను కూతురులా చూస్తారని... తనతో పాటు, తన చెల్లి, కుటుంబం ఉన్నారని చెప్పుకొచ్చింది. వివాదాస్పద వ్యాఖ్యల్లో నిజంలేదని కూడా స్పష్టం చేసింది.
మరోవైపు నేపాల్ లో జరిగే శివరాత్రి వేడుకలకు కుంభమేళ బ్యూటీ మోనాలీసాకు ఇప్పటికే ఆహ్వానం వచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రస్తుతం కుంభమేళ బ్యూటీ ఈ ఘటనతో మరోసారి సోషల్ మీడియాలో వైరల్గా మారింది.