Venus Movement Effect On Zodiac: అన్ని గ్రహాలు ఏదో ఒక సమయంలో తప్పకుండా తిరోగమనంతో పాటు సంచారాలు చేస్తాయి. ఇదిలా ఉంటే కొన్ని గ్రహాలు సంచారం, తిరోగమనం చేయడానికి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. ముఖ్యంగా శుక్రగ్రహం సంచారం చేయడం వల్ల కొన్ని రాశులవారిపై తీవ్ర ప్రభావం పడుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ ప్రభావం వల్ల వ్యక్తిగత జీవితాల్లో ఆనందం, శ్రేయస్సు, ప్రేమతో పాటు విలాసానికి లోటు ఉండదు..
మార్చి 23న తర్వాత శుక్ర గ్రహం కదలికల జరపబోతోంది. ప్రస్తుతం మీన రాశిలో శుక్రుడు ఉచ్చ స్థితిలో ఉన్నాడు. అయితే హోలీ తర్వాత మార్పులు రాబోతున్నాయి. దీని వల్ల కొన్ని రాశులవారి వారి జీవితాల్లో పూర్తిగా మార్పులు వస్తాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.
ఈ గ్రహం కదలికల కారణంగా ఎంతో శక్తివంతమైన మాళవ్య మహా రాజయోగం ఏర్పడుతుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. దీని కారణంగా ఈ కింది రాశులవారికి అదృష్టం కలిసి వస్తుంది. అలాగే ఆరోగ్యపరంగా వస్తున్న సమస్యలు కూడా కూడా తొలగిపోతాయి.
మాళవ్య మహారాజయోగం వల్ల మకరరాశి వారు తప్పకుండా శుభవార్తలు వింటారు. అంతేకాకుండా ఎలాంటి పనులు చేసిన విజయాలు సాధిస్తారు. అలాగే పెండింగ్లో ఉన్న పనులు కూడా పరిష్కారమవుతాయి.
మకర రాశివారికి ఈ యోగం ఎఫెక్ట్ వల్ల డబ్బు సంపాదించేందుకు గొప్ప అవకాశాలు లభిస్తాయి. అలాగే ఇతరులతో సంబంధాలు కూడా మెరుగుపడతాయి. అలాగే ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. దీంతో పాటు కొన్ని రకాల పనులు చేయడం వల్ల అద్భుతమైన ఫలితాలు పొందుతారు.
మిథున రాశి వారిపై కూడా మాళవ్య మహారాజయోగం ఎఫెక్ట్ పడుతుంది. దీని వల్ల వీరు ఎలాంటి పనులు చేసిన గొప్ప అవకాశాలు పొందుతారు. అంతేకాకుండా సంపాదన కూడా రెట్టింపు అవుతుంది. అదృష్టం కూడా కలిసి వస్తుంది.
మిథున రాశివారికి అదృష్టం పెరగడం వల్ల జీవితంలో మంచి రోజులు ప్రారంభమవుతాయి. అలాగే వైవాహిక జీవితంలో వస్తున్న సమస్యలు కూడా తొలగిపోతాయి. దీని కారణంగా వివిధ సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి.
ధనుస్సు రాశి వారికి కూడా ఈ సమయంలో అద్భుతమైన ప్రయోజనాలు కలగుతాయి. వీరికి ఈ సమయం చాలా శుభప్రదంగా ఉంటుంది. అంతేకాకుండా వాహనాలతో పాటు కొత్త ఇండ్లు కూడా కొనుగోలు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎలాంటి పనులు చేసి విజయాలు సాధిస్తారు.