Chiranjeevi: ఫ్లైట్‌లో చిరంజీవి, సురేఖ పెళ్లి రోజు వేడుకలు.. నాగార్జున దంపతుల సర్ ప్రైజ్.. వైరల్‌గా మారిన పిక్స్..

Megastar Chiranjeevi wedding celebrations: మెగాస్టార్ చిరంజీవి తన పెళ్లి రోజును ఫ్లైట్ లో సెలబ్రేషన్స్ చేసుకున్నారు. చిరు పక్కనే ఆయన బెస్ట్ ఫ్యామిలీ ఫ్రెండ్ నాగార్జున దంపతులు కూడా ఉన్నారు.
 

1 /5

మెగా స్టార్ చిరంజీవి తన సతీమణి సురేఖతో కలిసి పెళ్లి రోజును ప్రత్యేకంగా ఫ్లైట్ లో జరుపుకున్నారు. ఈ క్రమంలో చిరు పక్కనే నాగార్జున ,అమల దంపతులు కూడా ఉండటం మరో విశేషంగా చెప్పుకొవచ్చు.

2 /5

చిరు  కొన్నిరోజులుగా విశ్వంబర మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. అయితే.. ఈరోజు చిరంజీవి, సురేఖల పెళ్లి రోజు సెలబ్రేషన్స్ కోసం దుబాయ్ కు వెళ్తున్నారు.ఈ క్రమంలో వీరు ప్రైవేటు జెట్లో పెళ్లి  వార్షికోత్సవం  జరుపుతున్నారు. 

3 /5

ఇక్కడ మరోస్పెషాలిటీ ఏంటంటే.. చిరు దంపతులు ప్రయాణిస్తున్న ప్రైవేటు జెట్ లోనే.. నాగార్జున, అమల దంపతులు కూడా ఉన్నారు. అదే విధంగా వీరితో పాటు.. మహేష్ బాబు సతీమణి నమ్రత కూడా ఇదే ఫ్లైట్ లో ఉన్నారు. 

4 /5

చిరంజీవి, సురేఖలు పెళ్లి రోజువేళ.. నాగార్జున, అమల దంపతులు ప్రత్యేకంగా పూలబొకె ఇచ్చి ప్రత్యేంగా విషేస్ చెప్పారు. ఈ క్రమంలో చిరంజీవి తన భార్యపై ప్రశంసలు కురిపించారు. తన బలం, శక్తి, తనను ముందుండి నడిపిస్తుందని  ఎమోషనల్ అయ్యారు.  

5 /5

మెగాస్టార్ చిరంజీవి, సురేఖను తన బెస్ట్ సోల్ మెట్ అంటూ ప్రశంసలు కురిపించారు. ప్రస్తుతం వీరి వెడ్డింగ్ సెలబ్రేషన్స్ లను చిరంజీవి తన సోషల్ మీడియా అకౌంట్ లో పొస్ట్ చేశారు.  దీంతో అభిమానులంతా.. చిరుకు పెళ్లి రోజు విషేస్ చెప్తున్నారు. ఈ పిక్స్ ప్రస్తుతం వైరల్గా మారాయి.