Mahesh Babu: SSMB29లో మహేష్ బాబు గడ్డం.. జుట్టు నిజమైనది కాదా..?

Mahesh Babu beard: ప్రస్తుతం ఉన్న తెలుగు హీరోల్లో సూపర్ స్టార్ అంటే మనకు వెంటనే గుర్తొచ్చే పేరు మహేష్ బాబు. ఈ హీరోకి అందం పరంగా చిన్న మచ్చ కూడా పెట్టలేము. అయినా కానీ మహేష్ బాబు గురించి కొన్ని ట్రోల్స్ మాత్రం సోషల్ మీడియాలో చూస్తూ ఉంటాము. ముఖ్యంగా ఇవి వచ్చేది ఆయన గడ్డం, మీసాలు, జుట్టు పైనే..

1 /5

సూపర్ స్టార్ కృష్ణ కొడుకుగా వచ్చి.. తనకంటూ ప్రత్యేక అభిమానులను సంపాదించుకొని.. నేటితరం సూపర్ స్టార్ గా ఎదిగిన హీరో మహేష్ బాబు. సినిమాలలోనే కాదు పర్సనల్ లైఫ్ లో కూడా ఈ హీరో గురించి చిన్న మచ్చ కూడా లేదు..

2 /5

కాంట్రవర్సీలకు దూరంగా ఉంటూ.. ఫ్యామిలీ మాన్ అంటే మహేష్ బాబు పేరు గుర్తొచ్చేలా చేసుకున్నారు ఈ హీరో. ఇక సినిమాల పరంగా కూడా.. ఈయనకి విపరీతమైన అభిమానులు ఉన్నారు. పాన్ ఇండియా సినిమా ఇప్పటివరకు మహేష్ బాబు దగ్గర నుంచి ఒక్కటి కూడా రాకపోయినా.. ఇప్పటికి ఎన్నోసార్లు తన అందం ద్వారా ఇంటర్నేషనల్ లెవెల్ లో పేరు తెచ్చుకున్నారు. 

3 /5

ఇక త్వరలోనే రాజమౌళి దర్శకత్వంలో వస్తోన్న SSMB29 ద్వారా.. పాన్ ఇండియా లెవెల్ లో రికార్డులు సృష్టించడానికి తయారైపోయారు. ఈ క్రమంలో ఈ సినిమా కోసం మహేష్ బాబులకు ప్రస్తుతం అభిమానులను తెగ ఖుషి చేస్తున్న సంగతి తెలిసిందే. మహేష్ బాబు గురించి ఎటువంటి యంటీ కామెంట్స్ చేయలేని వాళ్లు.. ఆయన జుట్టు, గడ్డం గురించే పలు విమర్శలు చేస్తూ ఉంటారు.

4 /5

ఇప్పటివరకు మహేష్ బాబు ఏ సినిమాలో కూడా.. పెద్దగా హెయిర్ స్టైల్ మార్చలేదు. అంతేకాదు రఫ్ అండ్ టఫ్ గా గడ్డం.. మీసాలతో కనిపించలేదు. అందుకే కొంతమంది మహేష్ బాబుది విగ్గు అని కూడా కామెంట్లు పెడుతూ ఉంటారు. 

5 /5

అయితే రాజమౌళి సినిమా కోసం మహేష్ బాబు గడ్డం, మీసాలు పెంచుకున్న సంగతి తెలిసిందే. అంతేకాకుండా కొత్త హెయిర్ స్టైల్ కోసం జుట్టు కూడా పెంచుకున్నాడు. ఈ క్రమంలో ఇవన్నీ కూడా పెట్టినవే అని ఒక వార్త వైరల్ అవుతుంది. సరిగ్గా గమనిస్తే కొన్ని ఫోటోలో మహేష్ బాబు జుట్టు వెనక తక్కువగానే ఉందని. మరికొన్ని ఫోటోల్లో ఎక్కువగా ఉందని. ఇలా ఎలా సాధ్యమని.. కాబట్టి తప్పకుండా మహేష్ బాబు ఇలాంటి విగ్.. అలానే గడ్డం అతికించుకున్నారని సోషల్ మీది కాదు కొంతమంది..విమర్శలు చేస్తున్నారు. అయితే ఈ వార్తల్లో ఎటువంటి నిజం లేదు అనేది సాధారణ ప్రేక్షకుల వాదన.