Maha shivaratri pooja vidhan: మహా శివరాత్రిని భక్తులు ఎంతో భక్తితో జరుపుకుంటారు. సూర్యోదయానికి ముందే నిద్రలేచి దైనందీక కార్యక్రమాలను ముగించుకుని ఆలయాలకు వెళ్తుంటారు. అయితే.. శివరాత్రి రోజున తప్పకుండా చేయాల్సిన కొన్నిపనులు ఇప్పుడు తెలుసుకుందాం.
మహా శివరాత్రిని భక్తులు ఎంతో పవిత్రంగా భావిస్తారు. చాలా మంది శివరాత్రి రోజున తప్పకుండా ఉపవాసాలు చేస్తారు. అంతే కాకుండా.. జాగరణ కూడా చేస్తారు. అయితే.. ఇవన్ని మనకు తెలిసిందే. కానీ శివరాత్రి రోజున ఒక మూడుపనులు భక్తులు చేస్తే ఆ శివయ్య అనుగ్రహాం మన మీద ఎల్లవేళల ఉంటుందంట.
శివరాత్రిని మనం ఈసారి ఫాల్గుణమాసం కృష్ణపక్షం చతుర్ధశి రోజు అంటే.. ఫిబ్రవరి 26న జరుపుకోబుతున్నాం. ఈరోజు తెల్లవారు జామున నుంచి శివరాత్రికి ఎంతో అనుకూలమైన సమయం ఉందని పండితులు చెబుతున్నారు.
ఈరోజున ముఖ్యంగా ఉదయాన్నే నిద్రలేచి స్నానాదికాలు పూర్తి చేసి, శుభ్రమైన దుస్తులు ధరించి పూజలు చేసుకుంటారు. చాలా మంది దగ్గరలోని శివాలయాలకు తప్పకుండా వెళ్లారు. అయితే.. శివరాత్రి రోజున మూడు పనులు తప్పకుండా చేయాలని పండితులు చెబుతున్నారు. దీని వల్ల ఆ ముక్కంటి ఆశీస్సులు మన మీద ఎల్లవేళల ఉంటాయంట.
శివరాత్రి రోజున తప్పకుండా పాలు, పెరుగు, తేనె, నెయ్యితో, చక్కెరతో శివలింగంను అభిషేకం చేయాలంట.అంతే కాకుండా.. బిల్వపత్రంను శివలింగం మీద అర్పించి మొక్కుకొవాలంట. అంతే కాకుండా.. తెల్లజిల్లెడు పువ్వుల్ని శివుడికి అర్పిస్తే ఆయన ఎంతో చల్లని చూపు మన మీద కురిపిస్తారంట.
చాలా మంది శివరాత్రి రోజున తప్పకుండా.. కైలాసం ఆట ఆడుతారు. ఈ ఆటలో ఎన్నిసార్లు పాముల కాటుకు గురైతే.. జీవితంలో వచ్చే సమస్యలు అన్ని కూడా దూరమౌతాయని పండితులు చెబుతుంటారు.
అందుకే శివరాత్రి రోజున భక్తులు పండితులు చెప్పినట్లు పై సూచనలు పాటించాలని చెప్తున్నారు. శివరాత్రి రోజున ఉపవాసం చేసే వాళ్లు ఫలాలు, పాలను తాగవచ్చు. అదే విధంగా ఏదైన ఆరోగ్య సమస్యలున్నవారు, ప్రెగ్నెంట్ మహిళలు, చిన్న పిల్లలు.. ఉపవాసాలు చేయకున్న కూడా.. శివుడ్ని ధ్యానిస్తూ పూజలు చేయాలని పండితులు చెబుతున్నారు.