Magha Purnima 2025: తెలుగు మాసాల్లో మాఘ మాసానికి ప్రత్యేక స్థానం ఉంది. ఉత్తరాయణ పుణ్యకాలం తర్వాత వచ్చే నెల కాబట్టి ఈ మాసానికి ఓ ప్రత్యేకత ఉంది. ముఖ్యంగా రథ సప్తమి, భీష్మాష్టమి, భీష్మ ఏకాదశి, మాఘ పౌర్ణమి, మహా శివరాత్రి వంటి పర్వదినాలు ఈ నెలలోనే ఉన్నాయి. అందుకే ఈ నెలకు ప్రత్యేకత ఉంది.
Magha Purnima 2025: అంతేకాదు దేవతా ప్రతిష్ఠలతో పాటు ఉపనయనాలు, గృహ ప్రవేశాలు, పెళ్లిళ్లకు మాఘ మాసానికి మించింది లేదని శాస్త్ర ప్రవచనం. అందులో మాఘ పౌర్ణమికి అందులో ప్రత్యేక స్థానం ఉంది. అందులో మాఘ పూర్ణిమ నాడు పొరపాటున కూడా ఈ 5 పనులు చేయకండి.
తెలుగు కాలండర్ ప్రకారం మాఘపౌర్ణమి ఫిబ్రవరి 12న రాబోతుంది. మాఘ మాసంలోని పౌర్ణమి రోజు స్నానం, దానం చేయడానికి చాలా ప్రత్యేకమైనదిగా పరిగణించబడుతుంది. ఈ పౌర్ణమిని మాఘి పూర్ణిమ అని కూడా అంటారు. మాఘ పూర్ణిమ రోజున దేవతలు భూమిపైకి దిగివస్తారని పురాణా కథనం. అందుకే ఈ సమయంలోనే కుంభమేళా వంటి పవిత్ర కార్యక్రమం జరగుతోంది. ఇటువంటి పుణ్యతిథిలో కొన్ని చేయకూడని పనులు ఏంటో చూద్దాం..
జ్యోతిషశాస్త్రం ప్రకారం, మాఘ పూర్ణిమ రోజున నల్లని దుస్తులు ధరించి పూజ చేయకూడదు. శాస్త్ర వచనం ప్రకారం ఈ రోజున నలుపు రంగును ఉపయోగించడం చాలా అశుభకరం. .
మాఘ పూర్ణిమ రోజున తెల్లవారుఝామునే నిద్ర లేవాలి. సూర్యోదయం వరకు నిద్రపోకూడదు. ఈ రోజున ఆలస్యంగా నిద్రపోతే సంపదకు దేవత అయిన లక్ష్మీ దేవికి ఆగ్రహం కలుగుతుందని ప్రతీతి. ఈ రోజున బ్రహ్మ ముహూర్తంలో మేల్కొని విష్ణువును, లక్ష్మీదేవిని ఆరాధించాలి.
మాఘ పూర్ణిమ రోజున తామస పదార్థాలు తినకూడదు. ముఖ్యంగా పూర్ణిమ రోజున వెల్లుల్లి, ఉల్లిపాయ, మాంసం, వైన్ మొదలైన వాటిని తినడం నిషేధించబడింది. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి ఆగ్రహానికి గురువుతారు.
మాఘ పూర్ణిమ రోజున జుట్టు,గోర్లు అసలు కత్తిరించకూడదు. జుట్టు, గోళ్లను కత్తిరించిన తర్వాత, అవి శరీరంలోని చనిపోయిన భాగాలుగా కనిపిస్తాయి.
మాఘ పూర్ణిమ రోజున ఎవరినీ అసభ్యకరమైన పదాలో దూషించకూడదు. ఇది కాకుండా, ఈ రోజున ఇతరులను ఎట్టి పరిస్థితుల్లో అవమానించే రీతిలో మాట్లాడకూడదు. ఇలా చేయడం చాలా అశుభంగా పరిగణించబడుతుంది.
గమనిక: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు, పండితులు, నెట్ లో పంచాగంతో పాటు శాస్త్ర గ్రంథాల్లో ఉన్న సమాచారం ఆధారంగా చెప్పబడింది. ZEE NEWS దీనిని ధృవీకరించడం లేదు.