Ketu Transit 2025 Effects: జ్యోతిషశాస్త్రం ప్రకారం.. గ్రహ సంచారాల పరంగా 2025 సంవత్సరం చాలా ప్రత్యేకతను కలిగి ఉంటుంది. ఎందుకంటే ఈ ఏడాదిలోనే ఎంతో శక్తివంతమైన గ్రహాలు రాశి సంచారం చేయబోతున్నాయి. అలాగే ఈ సమయంలో ఎంతో శక్తివంతమైన రాజయోగాలతో పాటు శుభ సమయాలు కూడా ఏర్పడుతున్నాయి. అంతేకాకుండా నక్షత్ర సంచారాలు కూడా జరుగుతాయి. దీంతో ఈ సమయంలో అన్ని రాశులవారిపై ఎంతో శక్తివంతమైన ఎఫెక్ట్ పడుతుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.
జ్యోతిష్య శాస్త్రంలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన కేతువు గ్రహం 18 నెలల తర్వాత రాశి సంచారం చేస్తుంది. అయితే జాతకంలో రాహువు, కేతువు గ్రహాలు రెండు శుభస్థానంలో ఉంటే ఊహించని ధన లాభాలు కలుగుతాయి. ఇదిలా ఉంటే ఈ కేతువు గ్రహం మే 18న సాయంత్రం 4 గంటలకు సింహ రాశిలోకి ప్రవేశించబోతున్నాడు..
సింహరాశిలోకి కేతువు ప్రవేశించడం వల్ల కొన్ని రాశులవారికి భౌతిక సుఖాలు కలుగుతాయి. దీంతో పాటు జీవితంలో సమస్యలు కూడా పరిష్కారమవుతాయి. అలాగే ఆరోగ్యపరంగా వస్తున్న సమస్యలు కూడా తొలగిపోతాయి. అలాగే వ్యక్తుల మధ్య సంబంధాలు కూడా మెరుగుపడే అవకాశాలు కూడా ఉన్నాయి.
కేతువు సంచారం వల్ల సింహ రాశివారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. ముఖ్యంగా వీరికి సంపదన పెరగడమే కాకుండా కీర్తి ప్రతిష్టలు కూడా రెట్టింపు అవుతాయి. అలాగే ఆధ్యాత్మికత చింతన కూడా పెరుగుతుంది. అలాగే వీరికి ఈ సమయంలో విశ్వాసం కూడా విపరీతంగా పెరుగుతుంది.
సింహ రాశివారికి కొత్త ఆదాయ వనరులు కూడా తిరిగి వస్తాయి. అంతేకాకుండా వ్యాపారాలు, వృత్తులు చేస్తూ జీవనం సాగిస్తున్న వారికి ఈ సమయం చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే ఆర్థిక పరిస్థితులు కూడా చాలా వరకు మెరుగుపడతాయి.
కేతువు సంచారం వల్ల మేష రాశివారికి కూడా చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. వీరికి ఊహించని విజయాలు కలుగుతాయి. అంతేకాకుండా కొత్త అవకాశాలు కూడా లభిస్తాయి. దీంతో పాటు కేతువు ఎఫెక్ట్ వల్ల జీవితంలో వస్తున్న సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి.
అలాగే మేష రాశివారికి ఆర్థిక పరిస్థితులు కూడా చాలా వరకు మెరుగుపడతాయి. అంతేకాకుండా కృషి, అంకితభావంతో పనులు చేస్తే ఆశించిన లాభాలు కూడా కలుగుతాయి. అలాగే వీరు ఈ సమయంలో ధ్యానం చేయడం కూడా చాలా మంచిది.
కేతువు సంచారం వల్ల ధనుస్సు రాశివారికి అనుకున్న లాభాలు కలుగుతాయి. అలాగే వీరికి కొత్త అవకాశాలు కూడా లభిస్తాయి. కేతువు అనుగ్రహం వల్ల జీవితం కూడా చాలా బాగుంటుంది. ఉద్యోగాలు చేసేవారికి కూడా ఎంతో బాగుంటుంది. అంతేకాకుండా ప్రణాళికలతో ముందుకు వెళ్లేవారికి ఈ సమయం చాలా అద్భుతంగా ఉంటుంది.