Mahesh Babu Family మహేష్ బాబు, నమ్రత.. శిల్పా శిరోద్కర్ సపోర్ట్ చేయలేదని, వారి మధ్య గొడవలు ఉన్నాయంటూ వచ్చిన వార్తలకు క్లారిటీ ఇచ్చింది శిల్పా శిరోద్కర్. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మహేష్ బాబు పడిన ఆసక్తికర వ్యాఖ్యలు సైతం చేసింది. మహేష్ బాబు భార్య నమ్రతాకి సోదరి అయినా శిల్పా.. మన సూపర్ స్టార్ గురించి ఏమి చెప్పిందో ఒకసారి చూద్దాం..
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న మహేష్ బాబు.. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఎస్ఎస్ఎంబి 29 అనే వర్కింగ్ టైటిల్ తో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు ఈయన మరదలు శిల్పా శిరోద్కర్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. తెలుగులో ఈమె ఒక సినిమా మాత్రమే చేసినా.. హిందీలో మాత్రం పలు సినిమాలు చేస్తూ.. భారీ పాపులారిటీ అందుకుంది.
ముఖ్యంగా బిగ్ బాస్ తో మరింత క్రేజ్ సొంతం చేసుకుంది. అన్నిటికి మించి మహేష్ బాబు మరదలుగా ఇంకాస్త ఫేమ్ సొంతం చేసుకుందని చెప్పవచ్చు. ఇకపోతే మహేష్ బాబుకు మరదలు అయినప్పటికీ, ఎప్పుడూ ఆమె గురించి ఎక్కడ మహేష్ బాబు ప్రస్తావించరు. సోషల్ మీడియాలో ఆమె గురించి పోస్ట్ కూడా పెట్టరు. దీనికి తోడు నమ్రత, శిల్పాకు మధ్య భేదాభిప్రాయాలు ఉన్నాయనే పుకార్లు కూడా వినిపిస్తూ ఉంటాయి.
అయితే ఈ విషయాలను శిల్పా దగ్గర ప్రస్తావించినప్పుడు స్వయంగా ఆమె ఆసక్తికర సమాధానం పంచుకుంది. దీంతో గత కొన్ని సంవత్సరాలుగా కొంతమంది వివాదం అంటూ సృష్టిస్తున్న పుకార్లకు కాస్త పులిస్టాప్ పడింది. అసలు విషయంలోకి వెళ్తే.. శిల్ప ఇటీవల హిందీ బిగ్ బాస్ కార్యక్రమంలో పాల్గొన్న విషయం తెలిసిందే. అయితే ఈ సీజన్ చివరి వరకు ఉన్న ఈమె ఎలిమినేట్ అయింది. ఆ సమయంలో ఆమె గురించి మహేష్ బాబు ఒక్క పోస్ట్ కూడా సోషల్ మీడియాలో పెట్టకపోవడం అసలు విమర్శకు కారణమైంది.
ఇక దీనిపై శిల్పా మాట్లాడుతూ.. “సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడితేనే మా మధ్య మంచి సంబంధాలు ఉన్నాయని, లేకపోతే విభేదాలు ఉన్నాయని అనుకోవడం కరెక్ట్ కాదు. అయినా మనుషుల మధ్య అనుబంధాన్ని సోషల్ మీడియా పోస్టుల ద్వారా ఎలా అంచనా వేస్తారు. మేము ఆన్లైన్లో ప్రేమను అభిమానాన్ని పంచుకునే వాళ్ళం కాదు. అయినా నన్ను నేను నిరూపించుకోవడానికి మాత్రమే నేను బిగ్ బాస్ కి వెళ్ళాను. నమ్రతా చెల్లి గానో లేక మహేష్ బాబు మరదలిగానో అక్కడికి వెళ్ళలేదు. వాళ్ళిద్దరూ ప్రైవేటు పర్సన్స్ ఇతరులతో త్వరగా కలవరు. ఇది చూసి చాలామంది పొగరు అనుకుంటారు.”
“కానీ వాళ్ళిద్దరూ చాలా కూల్ పర్సన్స్. మహేష్ అవసరమైనప్పుడు మాత్రం ఖచ్చితంగా అండగా నిలబడతాడు,” అంటూ క్లారిటీ ఇచ్చింది శిల్పా శిరోద్కర్ మొత్తానికైతే వివాదానికి కాస్త చెక్ పడిందని చెప్పవచ్చు.