Chhaava Movie 1st Week Box office Collecions:‘ఛావా’ ఫస్ట్ వీక్ బాక్సాఫీస్ కలెక్షన్స్.. విక్కీ కౌశల్ నట విశ్వరూపానికి బాక్సాఫీస్ సలామ్..

Chhaava Movie 1st Week Box office Collecions: విక్కీ కౌశల్  టైటిల్ రోల్లో   రష్మిక మందన్న కథానాయికగా అక్షయ్ ఖన్నా ఔరంగజేబు పాత్రలో నటించిన చిత్రం ‘ఛావా’. ఫిబ్రవరి 14న  ఛత్రపతి శివాజీ జయంతి కానుకగా రిలీజైన ఈ చిత్రం ఇపుడు భారతీయ బాక్సాఫీస్ దగ్గర అన్ని రికార్డులను పాతర వేసే విధంగా దూసుకుపోతుంది.

1 /7

Chhaava Movie 1st Week Box office Collecions: ఛత్రపతి శివాజీ కుమారుడు  ‘ఛత్రపతి శంభాజీ మహారాజ్’ జీవిత కథతో తెరకెక్కిన ‘ఛావా’ సినిమా విడుదలైన రోజు నుంచే బాక్సాఫీస్ దగ్గర దుమ్ము దుమారం రేపుతోంది. ఇందులో రష్మిక మందన్న కాకుండా పెద్ద స్టార్ క్యాస్ట్ లేదు. కేవలం కథను నమ్ముకొని దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ ఈ సినిమా అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో నిర్మించాడు. ఈ సినిమాకు ఇప్పటికే పలు రాష్ట్ర ప్రభుత్వాలు పన్ను రాయితీ ప్రకటించారు.

2 /7

రెండో మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ పెద్ద కుమారుడైన ‘శంభాజీ మహారాజ్’ను ‘ఛావా’ అని ముద్దుగా పిలుస్తుంటారు. అదే ఈ చిత్రానికి టైటిల్ గా పెట్టారు. ముఖ్యంగా గత కొన్నేళ్లుగా బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో యాంటీ హిందూ సినిమాల  నుంచి ప్రో హిందూ నేషనలిజమ్ వైపు దర్శక, నిర్మాతలు అడుగులు వేస్తున్నారు.

3 /7

ఛావా’ సినిమాతో విక్కీ కౌశల్ పేరు మారుమోగిపోయింది. ‘ఛావా’ సినిమా ముందు వరకు  ఇతనో మీడియం రేంజ్ కంటే తక్కువ స్థాయి  హీరో. కానీ ‘ఛావా’ విడుదల తర్వాత విక్కీ కౌశల్ పేరు టాక్ ఆఫ్ ది ఇండియన్ ఇండస్ట్రీగా మారింది. ఇదో మల్టీస్టారర్ మూవీ కాదు.. పెద్ద స్టార్ క్యాస్ట్ లేదు. బడా డైరెక్టర్ తెరకెక్కించక పోయినా.. బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా దుమ్ము దులుపుతోంది.

4 /7

‘ఛావా’ సినిమాలో  శంభాజీ మహారాజ్ పాత్రలో నటించాడనే కంటే జీవించాడనే చెప్పాలి. ముఖ్యంగా 2025లో జాతీయ ఉత్తమ చిత్రంతో పాటు నేషనల్ బెస్ట్ యాక్టర్, యాక్ట్రెస్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఇలా అన్ని అవార్డులు ఛావాకు  ఇవ్వాల్సిందే అని ప్రేక్షకులు సైతం ముక్త కంఠంతో చెబుతున్నారు.

5 /7

ఈ సినిమా ఏసుబాయ్ పాత్రలో రష్మిక మందన్న నటనకు జోహార్ అనాల్సిందే. అటు ఔరంగజేబు పాత్రలో అక్షయ్ ఖన్నా తన విలనిజంలో క్రూరత్వాన్ని ప్రదర్శించాడు.  మొత్తంగా తన విలనిజంతో హీరో పాత్రకు మంచి పేరు తీసుకొచ్చాడు.  నిన్నటితో బాక్సాఫీస్ దగ్గర మొదటి వారం పూర్తి చేసుకుంది. ఏడో రోజు ఈ సినిమా రూ. 21.60 కోట్ల నెట్ వసూళ్లను రాబట్టి మంచి హోల్డ్ కనబరిచింది.

6 /7

ఫస్ట్ డే  రూ. 33.10 కోట్లు..సెకండ్ డే రూ. 39.30 కోట్లు.. ఆదివారం.. రూ. 49.03 కోట్లు.. మండే.. రూ. 24.10 కోట్లు.. మంగళవారం .. రూ. 25.75 కోట్లు.. బుధవారం శివాజీ జయంతి రోజున.. రూ. 32.40 కోట్లు.. గురువారం రూ. 21.60 కోట్ల  నెట్ వసూళ్లు రాబట్టినట్టు ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి.

7 /7

బాక్సాఫీస్ దగ్గర ఫస్ట్ వీక్ మన దేశంలో ‘ఛావా’ మూవీ రూ. 225.28 కోట్ల నెట్ వసూల్లతో మంచి జోరు మీదుంది. ఇదే జోరు కంటిన్యూ అయితే.. ఈ సినిమా రూ. 500 కోట్ల నెట్ వసూళ్లు సాధించినా.. ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. మొత్తంగా ఈ సినిమా ఓవరాల్ గా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి వసూళ్లను సాధిస్తుందో చూడాలి.