Pension: 55 రూపాయలతో నెలకు 3 వేలు పెన్షన్ పొందే పథకం.. ఇలా అప్లై చేసుకోండి

Prime Minister Shram Yogi Mandhan Yojana: కార్మికులు తక్కువ వేతనంతో ఇబ్బందులు పడుతున్నవారికి కేంద్రంలోని మోదీ సర్కార్ మంచి స్కీమును తీసుకువచ్చింది. ఈ కొత్త పెన్షన్ పథకం ద్వారా నెలకు రూ. 3వేల పెన్షన్ తీసుకోవచ్చు. ఇంతకీ ఈ పథకం ఏంటి. ఎలా అప్లయ్  చేసుకోవాలి. పూర్తి వివరాలు తెలుసుకుందాం. 
 

1 /6

Pension:  ఆర్థికంగా వెనకబడిన వారిని పరిగణలోనికి తీసుకుని కేంద్ర ప్రభుత్వం పెన్షన్ పథకాన్ని తీసుకువచ్చింది. ఈ స్కీములో చేరినవారికి రిటైర్మెంట్ తర్వాత నెలకు రూ. 3వేల పెన్షన్ పొందే ఛాన్స్ ఉంటుంది. ఇంతకీ ఈ స్కీముకు అర్హులు ఎవరు. ఎలా దరఖాస్తు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. 

2 /6

ప్రధానమంత్రి శ్రామ్ యోగి మన్ ధన్ యోజన నెలకు రూ. 3000పించన్ అందించే ప్రభుత్వం పథకం ఇది. 2019లో కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ ఈ స్కీమును ప్రారంభించింది. ఈ స్కీములో చేరిన ప్రతి ఒక్కరికీ నెలవారి పెన్షన్ అందిస్తారు. అయితే ఇందుకోసం కొంత మొత్తంలో చెల్లించాల్సి ఉంటుంది. 

3 /6

ప్రధానమంత్రి శ్రామ్ యోగి మాన్ధన్ యోజనలో చేరేవారు నెలకు రూ. 55చెల్లించాలి. 60ఏళ్ల వయస్సు తర్వాత నెలకు రూ. 3వేల పెన్షన్ పొందుతారు. కార్మికులకు రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక స్వాతంత్రం పొందడానికి సహాయపడుతుంది. దంపతులిద్దరూ విడివిడిగా చేరి ఏడాదికి రూ. 72వేల పింఛన్ పొందవచ్చు. 

4 /6

ఈ స్కీములో చేరే వారి వయస్సు 18ఏళ్ల నుంచి 40ఏళ్ల మధ్య ఉండాలి. నెలకు ఆదాయం రూ. 15వేల లోపు ఉండాలి. ఈపీఎఫ్ఓ, ఈఎస్ఐసీ సభ్యులుగా ఉంటే ఈ స్కీములో చేడానికి అనర్హులు. అలాగే ఈ స్కీములో చేరాలంటే ఈ శ్రమ్ కార్డు కచ్చితంగా ఉండాలి.   

5 /6

ఈ స్కీముకు దరఖాస్తు చేసుకోవాలనుకునేవారు ముందుగా అధికారిక వెబ్ సైట్లోకి వెళ్లాలి. తర్వాత క్లిక్ హియర్ టు అప్లయ్ నౌ అనే ట్యాబ్ ను క్లిక్ చేయాలి. ఆ తర్వా సెల్ఫ్ ఎన్ రూల్ మెంట్ క్లిక్ చేయాలి. ఆ తర్వాత మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి కంటిన్యూ అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి.   

6 /6

ఆ తర్వాత మీరు మీ పేరు, ఈ మెయిల్ ఐడీ, క్యాప్చా ఐడీ వంటి వివరాలను ఎంటర్ చేసి జనరేట్ ఓటీపీ పై క్లిక్ చేయాలి. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై పై క్లిక్ చేయాలి. అవసరమైన వివరాలను నమోదు చేసి డాక్యుమెంట్లను అప్ లోడ్ చేసి దరఖాస్తు పూర్తి చేయాలి. చివరిగా భవిష్యత్తు అవసరాల కోసం డాక్యుమెంట్ ను ప్రింట్ అవుట్ తీసుకోవాలి.