BSNL Lowet Plan: బీఎస్ఎన్ఎల్ 4g నెట్వర్క్ ను విస్తరిస్తున్న సంగతి తెలిసిందే.. ఇప్పటికే లక్షకు పైగా కొత్త మొబైల్ టవర్లను ఏర్పాటు చేసింది. ఈ ప్రభుత్వరంగ టెలికాం కంపెనీ అతి త్వరలో 5జి సర్వీసులను కూడా ప్రారంభించనుంది. ఈ నేపథ్యంలో బిఎస్ఎన్ఎల్ ప్రైవేటు దిగ్గజ కంపెనీలకు గట్టి పోటీ ఇస్తుంది. ఈరోజు రూ.5 రోజుకు 180 రోజుల వ్యాలిడిటీ అందిస్తోన్న ప్లాన్ వివరాలు తెలుసుకుందాం..
బీఎస్ఎన్ఎల్ ప్రైవేటు దిగ్గజ కంపెనీలకు పోటీ ఇస్తూ వ్యాలిడిటీ ప్లాన్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. అపరిమిత వాయిస్ కాలింగ్ తో పాటు బంపర్ బెనిఫిట్స్ అందిస్తుంది. ఈ రోజు కూడా బిఎస్ఎన్ఎల్ అందిస్తున్న అతి తక్కువ ధర కేవలం రూ.5 రూపాయలతో అందిస్తున్న ప్లాన్ వివరాలు తెలుసుకుందాం.
బీఎస్ఎన్ఎల్ 180 రోజుల వ్యాలిడిటీ ప్లాన్ కేవలం రూ.5 కంటే తక్కువ ధరలో పరిచయం చేసింది. అంటే రూ.897 రూపాయలతో మీరు 180 డేస్ వాలిడిటీ పొందవచ్చు.. ఇందులో మీరు అపరిమిత వాయిస్ కాలింగ్ తో పాటు ఫ్రీ ఇన్కమింగ్ కాల్స్, రోమింగ్ పొందుతారు.
ఇది కాకుండా బిఎస్ఎన్ఎల్ యూజర్లు 100 ఎస్ఎంఎస్ లు ప్రతిరోజు ఉచితంగా పొందుతారు. మొత్తం 90 జీబీ హై స్పీడ్ డేటా అందిస్తోంది డేటా లిమిట్ అయిపోయిన తర్వాత 45 కేబిపిఎస్ డేటా పొందుతారు..
అయితే వోడాఫోన్ ఐడియా (VI) కూడా 180 రోజుల వ్యాలిడిటీ ప్లాను తీసుకువచ్చింది. ఇది కాకుండా మరో రెండు ప్రైవేట్ దిగ్గజ కంపెనీలు కూడా అందిస్తున్నాయి. కానీ బిఎస్ఎన్ఎల్ మొబైల్ బైటీవీ యాక్సెస్ కూడా అందిస్తుంది. ఇందులో మీరు 450 లైవ్ టీవీ చానల్స్ పొందవచ్చు. దీంతోపాటు ఓటీటీలు కూడా అందుబాటులో ఉన్నాయి.
బిఎస్ఎన్ఎల్ రెండు కొత్త ప్రిపేయిడ్ ప్లాన్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. ప్రధానంగా ఆపరిమిత వాయిస్ కాలింగ్ అందించడానికి ఈ ప్యాక్లను అందుబాటులోకి తెచ్చింది. దీంతో రూ.99 రూపాయలకే వాయిస్ ప్లానింగ్ ప్రారంభం అవుతుంది. ట్రయ్ ఆదేశాల మేరకు ఫీచర్ ఫోన్ వినియోగదారులకు ఈ ప్లానులను బిఎస్ఎన్ఎల్ పరిచయం చేసింది.