BSNL New SIM: బీఎస్‌ఎన్‌ఎల్‌ సిమ్‌ కార్డ్‌ ఎలా యాక్టివేట్‌ చేయాలి? సింపుల్‌ స్టెప్స్ మీకోసం

BSNL SIM Card Activation: బిఎస్ఎన్ఎల్ సిమ్‌ కార్డుల వినియోగం ఈ రోజుల్లో ఎక్కువగా పెరుగుతుంది. అతి తక్కువ ధరలోనే ఈ ప్రభుత్వ రంగ కంపెనీ ఆఫర్లను ప్రకటిస్తుంది. మీరు కూడా బిఎస్ఎన్ఎల్ సిమ్ కార్డు ఉపయోగిస్తున్నట్లయితే కొత్తగా కొన్న సిమ్ కార్డులో కాల్, మెసేజ్, మొబైల్ డేటాను యాక్సెస్ చేయడానికి ముందుగా యాక్టివేషన్ చేయాలి. ఈరోజు బిఎస్ఎన్ఎల్ సిమ్‌ కార్డును ఎలా యాక్టివేట్ చేసి ఉపయోగించాలి ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం..
 

1 /6

బిఎస్ఎన్ఎల్ సిమ్‌ కార్డు యాక్టివేట్ చేయడానికి కొన్ని సింపుల్ స్టెప్స్‌ ఉన్నాయి. ఇందులో వ్యక్తిగత వివరాల వెరిఫికేషన్ కూడా ఉంటుంది. ఇది యాక్టివేషన్ లేకుండా ఏ సిమ్‌ కూడా ఉపయోగించలేము.. ముఖ్యంగా ఇంటర్నెట్ యాక్సెస్ ఎనేబుల్ చేయడం కష్టతరం. ఈ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ కచ్చితం. అంతేకాదు బిఎస్ఎన్ఎల్ కాన్ఫిగర్ డేటా సెట్టింగ్ కూడా కరెక్ట్ గా ఉండాలి.  

2 /6

కొత్త బిఎస్ఎన్ఎల్ సిమ్ కార్డు యాక్టివేట్ చేసుకోవడానికి సింపుల్ స్టెప్స్.. ముందుగా బిఎస్ఎన్ఎల్ సిమ్‌ కార్డు స్మార్ట్ ఫోన్లో సిమ్ ట్రే లో ఇన్సర్ట్ చేయాలి ఒకవేళ మీ సిమ్ కార్డులో డ్యూయల్ సిమ్ ఆప్షన్ ఉంటే ప్రైమరీ స్లాట్ ఉపయోగించడం బెట్టర్‌. ఆ తర్వాత మీ స్మార్ట్ ఫోన్ ఆన్‌ చేయాలి.

3 /6

బీఎస్ఎన్ఎల్ నెట్‌వర్క్ డిటెక్ట్‌ అయ్యాక ఫోన్ డయలర్ ఓపెన్ చేయాలి. ఆ తర్వాత 1507 కి డయల్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు టెలి వెరిఫికేషన్ ప్రాసెస్ ప్రారంభం అవుతుంది. అందులో చెప్పినట్టుగా ఫాలో అవ్వాలి.  

4 /6

ఇందులో పర్సనల్ డీటెయిల్స్ వెరిఫై చేస్తారు. మీకు నచ్చిన భాషను ఎంచుకొని వెరిఫై చేసుకోవచ్చు. ఆ తర్వాత కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది. ఈ మొత్తం ప్రక్రియకు 30 నిమిషాలు నుంచి 2 గంటల సమయం పడుతుంది. ఒకవేళ మీ సిమ్ యాక్టివేషన్ ఆలస్యం అవుతే బిఎస్ఎన్ఎల్ కస్టమర్ కేర్ 18003451500 కి కాల్ చేయాలి.  

5 /6

ఇప్పుడు డేటా సర్వీస్ ను బిఎస్ఎన్ఎల్ సిమ్‌ కార్డులో ఎనేబుల్ చేసే విధానం.. 'START'  అని టైప్‌ చేసి 1925 బిఎస్ఎన్ఎల్ నెంబర్‌కు ఎస్ఎంఎస్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు మీకు కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది. మొబైల్ డేటా సర్వీస్ యాక్టివేటెడ్ అనే కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది.. చాలా సందర్భాలలో బిఎస్ఎన్ఎల్ ఆటోమేటిక్‌గా ఈ ఇంటర్నెట్ సెట్టింగ్ ని యాక్టివేట్ చేస్తుంది. లేకపోతే మాన్యువల్ గా కూడా కాన్ఫిగర్‌ చేసుకోవచ్చు.

6 /6

ఆండ్రాయిడ్ డివైస్- నావిగేట్ టు సెట్టింగ్స్ లోకి వెళ్ళాలి. ఆ తర్వాత నెట్వర్క్ అండ్ ఇంటర్నెట్ ఎంపిక చేసుకోవాలి. అందులో మొబైల్ నెట్వర్క్ ఉంటుంది. అక్కడ యాక్సెస్ పాయింట్ నేమ్స్ పై టాప్ చేయాల్సి ఉంటుంది. అక్కడ మీరు ఆడ్ లేదా '+' బటన్ నొక్కితే న్యూ APN క్రియేట్ అవుతుంది. అక్కడ నేమ్ వద్ద -బిఎస్ఎన్ఎల్, APN- వద్ద BSNLnet ఎంటర్ చేయాల్సి వస్తుంది. ఆ తర్వాత సెట్టింగ్స్ సేవ్ చేసుకుంటే ఏపీఎన్ క్రియేట్ అవుతుంది.