Black Wheat Remedies: ప్రకృతిలో లభించే వివిధ రకాల ధాన్యాల్లో గోధుమలు ఒకటి. ఆరోగ్యపరంగా అద్భుతమైన ప్రయోజనాలు కలిగినవి. ముఖ్యంగా బ్లాక్ గోధుమలు. ఇందులో ఆరోగ్యానికి కావల్సిన అన్ని రకాల పోషకాలు సమృద్ధిగా ఉంటాయి.
Black Wheat Remedies: ఆరోగ్యానికి చాలా లాభదాయకం. రోజూ క్రమం తప్పకుండా నల్ల గోధుమలు తీసుకుంటే ఆరోగ్యపరంగా చాలా ప్రయోజనాలున్నాయి.
నల్ల గోధుమల్లో యాంటీ ఆక్సిడెంట్లు చాలా ఎక్కువ. శరీరాన్ని ప్రమాదకరమైన ఫ్రీ రాడికల్స్ నుంచి కాపాడుతాయి. ఇందులో ప్రోటీన్లు, ఫైబర్, ఐరన్, విటమిన్లు పెద్దమొత్తంలో ఉంటాయి. అందుకే ఆరోగ్యపరంగా చాలా మంచివి.
ఆరోగ్యంగా ఉండాలనుకుంటే నల్ల గోధుమలను తక్షణం డైట్‌లో చేర్చాల్సి ఉంటుంది. ఆరోగ్యానికి అన్ని విధాల లాభదాయకం. నల్ల గోధుమలు చాలా మహత్తు కలిగినవి.
సాధారణ గోధుమల రంగు లైట్ గా ఉంటుంది. ఇందులో పోషకాలు కూడా తక్కువ. కానీ నల్ల గోధుమల్లో పైబర్, యాంటీ ఆక్సిడెంట్లు చాలా ఎక్కువ. అందుకే ఆరోగ్యపరంగా చాలా మంచివి.
నల్ల గోధుమలు ముఖ్యంగా హిమాలయ ప్రాంతాల్లో పండుతాయి. నార్త్ ఇండియా, టిబెట్, నేపాల్ ప్రాంతాల్లో ఎక్కువగా లభిస్తాయి.
నల్ల గోధుమల పిండితో రోటీ, పుల్గా, పరాఠాలు చేయవచ్చు. దాలియా, సూప్ కూడా ఆరోగ్యపరంగా మంచిది. ఆరోగ్యానికి చాలా మేలు చేకూరుస్తుంది