Sanam shetty controversy comments: బిగ్ బాస్ ఫెమ్, కోలివుడ్ నటి సనమ్ శెట్టి ఇటీవల సంచలన ఆరోపణలు చేశారు. ఈ వ్యాఖ్యలు ఇండస్ట్రీలో దుమారంగా మారాయి.
ఇండస్ట్రీలలో తరచుగా లైంగిక వేధింపుల ఘటనలు వార్తలలో నిలుస్తున్నాయి. తాజాగా.. కోల్ వుడ్ నటి సనమ్ శెట్టి చేసిన వ్యాఖ్యలు మరోసారి దుమారంను రాజేశాయి. దీనిపై సోషల్ మీడియాలో కూడా విపరీతంగా చర్చ నడుస్తొంది.
సనమ్ శెట్టి ముఖ్యంగా తమిళ పరిశ్రమపై చేసిన వ్యాఖ్యలు వివాదస్పదంగా మారాయి. ముఖ్యంగా కొంత మంది నిర్మాతలకు సినిమాల్లో అవకాశాల కోసం సంప్రదిస్తే.. తమతో బెడ్ షేర్ చేసుకొవాలని వేధిస్తున్నారని బాంబు పేల్చారు.
అంతేకాకుండా.. తమిళ ఇండస్ట్రీలో లింగ వివక్ష విపరీతంగా ఉందన్నారు. హీరోయిన్ లకు ఒక పారితోషికం, హీరోలకు మరో విధంగా పారితోషికం ఉందన్నారు. సమానత్వం అనేది కేవలం మాటల్లో ఉందని, దాన్ని ఎవరు పాటించడంలేదని అన్నారు.
సాధారణంగా నిర్మాతలు ముఖ్యంగా కాల్స్ చేసి పిలుస్తారు. అయితే.. వారేదో సినిమాలో చాన్స్ ఇస్తున్నారని వెళ్తే.. తమతో మొదట గడపాలని.. పడక పంచుకుంటే.. చాన్స్ అన్నట్లు వ్యవహరిస్తున్నారని నటి సనమ్ శెట్టి ఆవేదన వ్యక్తం చేసింది.
ఇదిలా ఉండగా.. నటి సనమ్ శెట్టి మహేష్ బాబు 'శ్రీమంతుడు' సినిమాలో మేఘన పాత్రలో నటించింది. ఆ తర్వాత సంపూర్ణేష్ బాబు "సింగం 123" లలో సహాయక పాత్రను పోషించింది. 2019 తమిళ బిగ్ బాస్ లో కంటెస్టెంట్ గా కూడా పాల్గొంది.
తమిళంలో అనేక చిత్రాల్లో నటించింది. 2019 తమిళ బిగ్ బాస్ లో కంటెస్టెంట్ గా కూడా పాల్గొంది. సోషల్ మీడియాలో కూడా తరచూ లేటెస్ట్ ఫొటోలు షేర్ చేస్తూ యాక్టీవ్ గా కనిపిస్తుంటుంది. మానస్ నాగులపల్లి హీరోగా తెరకెక్కిన ‘ప్రేమికుడు’ వంటి చిత్రాల్లో కూడా నటించింది. ప్రస్తుతం నటి వ్యాఖ్యలతోమరోసారి కాస్టింగ్ కౌచ్ అంశం తెరమీదకు వచ్చింది.