8th pay Commission Salary Hike: భారీగా పెరగనున్న జీతాలు..ప్యూన్ నుంచి ఉన్నతాధికారులు ఎవరికెంత పెరుగుతుందో పూర్తి వివరాలు

8th pay Commission Salary Hike Details in Telugu: ఇటీవలే 8వ వేతన సంఘానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. త్వరలో దీనికి సంబంధించిన ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ నేపధ్యంలో ఉద్యోగ వర్గాల్లో ఎవరికి ఎంత జీతం పెరుగుతుంది, వివిధ కేటగరీ ఉద్యోగుల జీతాల పెంపు ఎలా ఉంటుందనేది తెలుసుకుందాం.

8th pay Commission Salary Hike Details in Telugu: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, పెన్షనర్ల పెన్షన్ పెంపు మార్పులు 8వ వేతన సంఘంలో కన్పించనున్నాయి. ఇటీవలే కేంద్ర కేబినెట్ 8వ వేతన సంఘానికి ఆమోదం తెలిపిన తరువాత దీనికి సంబంధించిన ప్రక్రియ మొదలైంది. ఈ నేపధ్యంలో పే లెవెల్ 1 నుంచి పే లెవెల్ 10 వరకూ ఉన్న వివిధ కేటగరీ ఉద్యోగులకు జీతాలు ఎంత పెరుగుతాయి, పెన్షన్ ఎంత పెరుగుతుందనేది స్పష్టంగా ఇక్కడ మీ కోసం.
 

1 /8

కేంద్ర ప్రభుత్వం 8వ వేతన సంఘానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో 65 లక్షల మంది పెన్షనర్లు, 50 లక్షల మంది ఉద్యోగులకు లబ్ది చేకూరనుంది. కొత్త పే స్కేల్ అనేది జనవరి 2026 నుంచి అమల్లోకి రావచ్చు. అప్పటి వరకూ 7వ వేతన సంఘం అమలవుతుంది. 8వ వేతన సంఘంతో ఉద్యోగుల జీతభత్యాల్లో కీలక మార్పు కన్పిస్తుంది. 

2 /8

8వ వేతన సంఘంలో జీతాల పెంపు అనేది ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ఆధారంగా ఉంటుంది. ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 1.92 నుంచి 2.86 వరకూ ఉండవచ్చని అంచనా. గరిష్టంగా 2.86 ఉంటే లెవెల్ 1 నుంచి లెవెల్ 10 వరకూ ఉన్న వివిధ కేటగరీ ఉద్యోగులకు జీతం ఎంత పెరుగుతుందనేది ఇక్కడ సులభంగా తెలుసుకుందాం.

3 /8

లెవెల్ 1 ఉద్యోగులు అంటే ప్యూన్, అసిస్టెంట్, సపోర్ స్టాఫ్ ఉంటారు. ప్రస్తుతం వీరికి కనీస వేతనం 18 వేలు కాగా 51,480 రూపాయలకు పెరవచ్చని అంచనా. అంటే ఏకంగా 33,480 రూపాయలు పెరుగుతుంది. ఇక లెవెల్ 2లో క్లరికల్ విధులు నిర్వహించే ఉద్యోగులుంటారు. ప్రస్తుతం వీరి కనీస వేతనం 19,900 కాగా 56,914 రూపాయలు అవుతుంది. అంటే 37,014 రూపాయలు పెరుగుతుంది. 

4 /8

ఇక లెవెల్ 3 లో కానిస్టేబుల్, స్కిల్డ్ వర్కర్లు ఉంటారు. ప్రస్తుతం వీరి కనీస వేతనం 21,700 రూపాయలు కాగా 62,062 రూపాయలకు పెరగనుంది. అంటే ఏకంగా 40,362 రూపాయలు పెరుగుతుంది. లెవెల్ 4 ఉద్యోగుల్లో గ్రేడ్ డి స్టెనోగ్రాఫ్లు, జూనియర్ క్లర్క్‌లు ఉంటారు. ప్రస్తుతం వీరికి కనీస వేతనం 25,500 రూపాయలు కాగా 72,939 రూపాయలు అవుతుంది. అంటే ఒకేసారి 4,430 రూపాయలు పెరుగుతుంది. 

5 /8

లెవెల్ 5 ఉద్యోగుల్లో సీనియర్ క్లర్క్‌లు, టెక్నికల్ స్టాఫ్ ఉంటారు. వీరికి ప్రస్తుతం 29,200 రూపాయలు కనీస వేతనం కాగా, 83,512 వేల రూపాయలు అవుతుంది. ఒకేసారి 54,312 రూపాయలు పెరుగుతుంది. లెవెల్ 6 ఉద్యోగుల్లో ఇన్‌స్పెక్టర్, సబ్ ఇన్‌స్పెక్టర్  ఉద్యోగులు ఉంటారు. అంటే 35,400 రూపాయలు పెరుగుతుంది. 

6 /8

పే స్కేల్ 7 ఉద్యోగుల్లో సూపరింటెండెంట్, డివిజనల్ ఆఫీసర్, అసిస్టెంట్ ఇంజనీర్ ఉద్యోగులు ఉంటారు. వీరికి ప్రస్తుతం కనీస వేతనం 44,900 రూపాయలు కాగా 1,28,414 రూపాయలు అవుతుంది. అంటే ఏకంగా 83,514 రూపాయలు పెరగనుంది. ఇక పే లెవెల్ 8 ఉద్యోగుల్లో డివిజనల్ ఆఫీసర్, అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ ఉద్యోగులుంటారు. వీరికి ప్రస్తుతం  కనీస వేతనం 47,600 రూపాయలు కాగా 1,44,368 అవుతుంది. 

7 /8

ఇక లెవెల్ 9 ఉద్యోగుల్లో డిప్యూటీ సూపరింటెండెంట్, ఎక్కౌంట్స్ ఆఫీసర్ ఉద్యోగులుంటారు. వీరికి ప్రస్తుతం కనీస వేతనం 53,100 రూపాయలు కాగా  1,51,866 రూపాయలు అవుతుంది. అంటే 98 వేలు ఒకేసారి పెరుగుతుంది. ఇక పే లెవెల్ 10 ఉద్యోగుల్లో గ్రూప్ ఎ అధికారులు ఉంటారు. వీరికి ప్రస్తుతం కనీస వేతనం 56,100 రూపాయలు కాగా 4,6,100 రూపాయలు కానుంది.

8 /8

8వ వేతన సంఘంలో ఫిట్‌మెంట్ ఎంత పెరిగితే ఉద్యోగుల జీతాలు అంతగా పెరుగుతాయి. అటు పెన్షనర్ల పెన్షన్ కూడా భారీగా పెరగనుంది. ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 2.86 ఉంటే పెన్షన్ ఏకంగా 30 శాతం పెరగవచ్చు. అంటే 9 వేలు కనీస పెన్షన్ కాస్తా 25,740 రూపాయలు అవుతుంది.