Kuber Yogam: ఈ మహాశివరాత్రి మూడు రాశుల వారికి అదృష్టాన్ని తెస్తుంది. మీన రాశిలోని గ్రహాల కలయిక గల.. కుబేర యోగం వీరికి ఉన్నత స్థాయిలో ఆర్థిక ప్రగతిని తీసుకురానుంది. మరి ఈ అదృష్ట రాశులు ఏవో తెలుసుకోండి.
కుబేర యోగం ఆర్థిక భాగ్యం అందించే శక్తివంతమైన జ్యోతిష్య యోగం. ఇది ఉన్నత స్థాయికి ఎదగడంలో సహాయపడుతుంది. కాగా మీన రాశిలోని గ్రహాల కలయిక గల.. ఈ మహాశివరాత్రి నుంచి ఈ కుబేర యోగిని..పొందగలిగే మూడు రాశులు ఏవంటే..?
వృషభ రాశి వారికి మహాశివరాత్రి ప్రత్యేక ఫలితాలను అందించనుంది. వ్యాపార లాభాలు పెరుగుతాయి. కొత్త అవకాశాలు రావొచ్చు. ముఖ్యంగా వీరికి ఈ సంవత్సరం మొత్తం ఆదాయం ఎక్కువగా ఉంటుంది.
సింహ రాశి వారికి మహాలక్ష్మి అనుగ్రహం కలుగుతుంది. స్థిరాస్తి కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. కుబేర యోగం వల్ల వీరికి అనుకోని ఆస్తులు కలిసి రావచ్చు.
వృశ్చిక రాశి వారికి పెట్టుబడుల ద్వారా మంచి లాభాలు వచ్చే సూచనలు ఉన్నాయి. ఆకస్మిక ధనలాభం జరుగవచ్చు.
శివుని పూజ చేయడం, మహాలక్ష్మీ సహస్రనామం పఠించడం, దాన ధర్మాలు చేయడం ద్వారా కుబేర యోగం మరింత శక్తివంతం అవుతుంది.
పైన చెప్పిన వివరాలు అధ్యయనాలు, జ్యోతిష్య నిపుణుల సలహాల మేరకు చెప్పినవి మాత్రమే. జి వీటికి ఎటువంటి బాధ్యత వహించదు.