Star Herione: ఒకప్పుడు కార్తీ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన స్టార్ హీరోయిన్.. ఇప్పుడు మళ్లీ ఆయన సినిమాలోనే హీరోయిన్గా నటిస్తోంది.. అప్పుడు ఎంతో చిన్న పాపగా కనిపించిన ఈమె.. ఇప్పుడు ఈయనతో కలిసి స్టెప్పులు వేస్తోంది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు అనే విషయం ఒకసారి చూద్దాం..
సాధారణంగా ఏ సినీ ఇండస్ట్రీలో అయినా సరే హీరోయిన్లు చైల్డ్ ఆర్టిస్ట్ గా అడుగుపెట్టి, ఒక హీరో సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి మళ్లీ పెద్దయ్యాక అదే హీరోతో రొమాన్స్ చేస్తే ఆ సందర్భం ఎలా ఉంటుందో ఇప్పటికే ఎన్నో సినిమాల ద్వారా నిరూపితమైంది. అయితే ఇప్పుడు మరొక జంట కూడా అలాగే ఆశ్చర్యపరుస్తోంది.
గతంలో హీరో కార్తీ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన అమ్మాయి ఇప్పుడు పెద్దదైపోయింది. వరుస సినిమాలు చేస్తూ హ్యాట్రిక్ విజయాలు అందుకుంటూ దూసుకుపోయింది. ఇక ఇప్పుడు సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న ఈ ముద్దుగుమ్మ కార్తీక్ తో జత కట్టడానికి సిద్ధమయ్యింది. మరి ఆమె ఎవరు ? ఆ సినిమా ఏంటి ? అనే విషయం ఇప్పుడు చూద్దాం..
అసలు విషయంలోకి వెళ్తే .. గతంలో హీరో కార్తీ నటించిన నాన్ మహాన్ అల్లా సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది యంగ్ బ్యూటీ కృతి శెట్టి. 2010లో విడుదలైన ఈ సినిమాలో ఒక పాపకి కార్తీ ముద్దుగా హాయ్ చెప్పడం మనం చూసే ఉంటాం. కానీ ఆ పాప అందులో కొన్ని సన్నివేశాలకు పరిమితమైంది. కానీ ఇప్పుడు ఆ పాప పెద్దదై.. మళ్లీ కార్తీక్ సరసన హీరోయిన్గా నటించడానికి సిద్ధమైంది.
ప్రస్తుతం కృతి శెట్టి దక్షిణ భారతదేశ చలనచిత్ర పరిశ్రమలో భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది. తెలుగులో వరుస సినిమాలు చేసి హ్యాట్రిక్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తోంది.. ఈ క్రమంలోని నలన్ కుమారస్వామి దర్శకత్వం వహించబోతున్న వా వాతీయార్ చిత్రంలో కార్తీ సరసన హీరోయిన్గా నటిస్తోంది.
ప్రస్తుతం ఈమె వయసు 21 సంవత్సరాలు. ఇకపోతే ఈ సినిమాలో కార్తీక్ కృతి శెట్టితో పాటు సత్యరాజ్, ఆనంద్ రాజ్, రాజ్ కిరణ్ వంటి భారీతారాగణం భాగం అయ్యారు. ఇక అలాగే తమిళంలో ప్రదీప్ రంగనాథన్ తో కలిసి విఘ్నేష్ శివన్ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ లో కూడా నటిస్తోంది కృతి శెట్టి. ఇకపోతే గతంలో కృతి శెట్టి చైల్డ్ ఆర్టిస్ట్ గా కార్తి సినిమాలో నటించి.. ఇప్పుడు హీరోయిన్ గా అవకాశం అందుకోవడంతో అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.