Nails Signs: మీ గోర్లపై ఇలాంటి మచ్చలు, గీతలు ఉంటే ఈ ప్రమాదకర వ్యాధులున్నట్టే

Nails Signs: మనిషి వేళ్లకు ఉండే గోర్ల గురించి చాలామందికి పూర్తిగా తెలియక పోవచ్చు. గోర్లు కేవలం అందంగా కన్పించేందుకే కాదు. ఆరోగ్య పరిస్థితికి సంకేతం కూడా. గోర్లపై ఉండే తెలుపు, పసుపు మచ్చలు, గోర్లు విరగడం, గీతలు ఉంటే తేలిగ్గా తీసుకోకూడదు. ఇవి కచ్చితంగా శరీరంలో వివిధ రకాల వ్యాధులకు సంకేతం. అందుకే గోర్లపై కన్పించే వివిధ రకాల మార్పుల్ని నిర్లక్ష్యం చేయకూడదు. 

Nails Signs: డయాబెటిస్, లివర్ , థైరాయిడ్, గుండె వ్యాధుల, పోషకాల లోపం వంటి వ్యాధులు ఉంటే గోర్లపై ఈ లక్షణాలు కన్పించవచ్చు. అందుకే చాలా అప్రమత్తంగా ఉండాలి.
 

1 /5

తెలుపు మచ్చలు మీ గోర్లపై చిన్న చిన్న తెలుపు మచ్చలు కన్పిస్తే కాల్షియం లేదా జింక్ లోపం కావచ్చు. చెడు ఆహారపు అలవాట్లు, పోషకాల లోపం ఉంటే ఈ పరిస్థితి తలెత్తుతుంది. ఈ తెలుపు మచ్చలు పెరిగితే మాత్రం అప్రమత్తంగా ఉండాలి

2 /5

తెలుపు మచ్చలు మీ గోర్లు పూర్తిగా తెలుపుగా కన్పిస్తే ఎనీమియా కావచ్చు. లివర్ వ్యాధులు, కిడ్నీ వ్యాధులకు సంకేతం కావచ్చు. శరీరంలో ఆక్సిజన్ లోపం కావచ్చు.

3 /5

నల్ల గీతలు మీ గోర్లపై నలుపు లేదా డార్క్ గోధుమ రంగు గీతలు కన్పిస్తే పొరపాటున కూడా తేలిగ్గా తీసుకోవద్దు. ఇది మెలనోమా స్కిన్ కేన్స్, గుండె వ్యాధులు, బ్లడ్ క్లాటింగ్ వంటి సీరియస్ వ్యాధుల ముప్పు కావచ్చు. ఈ గీతలు పెరుగుతుంటే వెంటనే వైద్యుని సంప్రదించాలి

4 /5

పసుపు మచ్చలు గోర్లపై పసుపు గీతలు లేదా మచ్చలు ఉంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఫంగల్ ఇన్‌ఫెక్షన్ ఉంటే ఇదే సమస్య ఉంటుంది. తేమలో లేదా నీళ్లలో ఎక్కువగా పనిచేసేవారిలో ఈ లక్షణం ఉండవచ్చు. అంతేకాకుండా లివర్ వ్యాధి, థైరాయిడ్, డయాబెటిస్ సమస్య ఉంటే గోర్లపై పసుపు మచ్చలు కన్పిస్తాయి.

5 /5

గోర్లు విరగడం, గీతలు గోర్లు తరచూ విరిగిపోతుంటే, గోర్లపై మచ్చలు ఉంటే థైరాయిడ్, విటమిన్ బి లోపం, డీహైడ్రేషన్ సమస్య కావచ్చు.