Mutual Fund: మీ దగ్గర పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టేంత డబ్బు లేదా. చిన్న మొత్తంలో ఎప్పటికప్పుడు పెట్టుబడి పెట్టే ప్లాన్ కోసం ఎదురుచూస్తున్నారా. అయితే మీకు సిప్ సరిగ్గా సరిపోతుంది. క్రమబద్ధంగా ఓ ప్లాన్ లో పెట్టుబడి పెడితే భారీ లాభాలను పొందాలనుకునేవారికి ఇది మంచి ఉపాయమని చెప్పవచ్చు. సిప్ గురించిన ఓ ముఖ్యమైన పెట్టుబడి పద్దతి ఇది. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Mutual Fund: తక్కువ పెట్టుబడితో కోట్ల ఆదాయం పొందే ఆదాయ మార్గాలు చాలా ఉన్నాయి. అయితే అందులో మనకు తగిన వాటిని ఎంచుకోవడంలోనే కిటుకు ఉంటుంది. ఇప్పుడు మనం చెప్పుకునే ప్లాన్ కూడా అలాంటిదే అని చెప్పవచ్చు.
నెలకు మీరు కేవలం రూ. 4500 పెట్టుబడి పెట్టగలిగితే చాలు. భవిష్యత్తులో అది మీకు కోట్ల ఆదాయాన్ని తీసుకువస్తుంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం.
మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ మార్కెట్ల్ రిస్కులకు లోబడి ఉన్నప్పటికీ భవిష్యత్తులో అవి మనకు మంచి రాబడిని అందిస్తాయి. ఇందులో పెట్టుబడి పెడితే వారికి అన్నింటికంటే మంచి ప్రయోజనం ఒకటి ఉంటుంది. అదే మీరు పెట్టుబడి పెట్టిన మొత్తంపై చక్రవడ్డీని పొందుతారు. ఇది ఇన్వెస్టర్లకు ద్రవ్యోల్బణం రిస్క్ నుంచి ఎప్పటికప్పుడు కాపాడుతుంది.
మ్యూచువల్ ఫండ్స్ లో సిప్ ప్లాన్ గురించి తెలుసుకుందాం. అసలు సిప్ ఎలా పనిచేస్తుంది. ఇది మనకు ఏ విధంగా లాభాలు తెచ్చిపెడుతుందనే విషయాలు చూస్తే..మ్యూచువల్ ఫండ్స్ లో సిప్ అనేది చాలా సులభమైన పద్ధతి.
ఈ పద్ధతి పెట్టుబడిదారుడికి వారానికో, నెలలవారీగా లేదా ఏడాదికోసారి ఇలా డబ్బును ఆదా చేసుకునే వెసులుబాటు కల్పిస్తుంది. మరో విషయం ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్ కంపెనీలు ఇప్పుడు కేవలం రూ. 100 పెట్టుబడులను కూడా అనుమతి ఇస్తాయి.
ఈ స్కీములో నెలకు రూ. 4500 ఇన్వెస్ట్ చేస్తే రూ. 2.50కోట్ల లక్ష్యాన్ని చేరుకునేందుకు 34ఏళ్లు పడుతుంది.
మనం ఇన్వెస్ట్ చేసిన మొత్తం రూ. 18లక్షల 36వేలు అవుతుంది. ఇందులో మనం అంచనా వేసిన లాభాలు రూ. 2కోట్ల 40లక్షల 51 వేల 842 రూపాయలు.
సిస్టమాటిక్ ఇన్వెస్టిమెంట్ ద్వారా క్రమంగా మ్యూచువల్ ఫండ్స్ లో పొదుపు చేసే అలవాటు మనలో ఆర్థిక క్రమశిక్షణను కూడా పెంచుతుంది.