Rashmika counter to Rishab Shetty: తాజాగా తాను బాలీవుడ్లో నటించిన ఛావా సినిమా ప్రమోషన్స్ లో పాల్గొనింది రష్మిక. ఇక ఇందులో భాగంగా ఈ హీరోయిన్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం అందరిని ఆశ్చర్యపరుస్తున్నా. విజయ్ దేవరకొండ తో రిలేషన్ కన్ఫామ్ చెయ్యడమే కాకుండా రిషబ్ శెట్టికి కూడా ఇన్ డైరెక్ట్ కౌంటర్ ఇచ్చింది ఈ భామ.
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో భారీ పాపులారిటీ దక్కించుకొని ఇప్పుడు ఇండియన్ బాక్సాఫీస్ వద్ద నేషనల్ క్రష్ గా పేరు దక్కించుకుంది రష్మిక.
కన్నడ ఇండస్ట్రీకి చెందిన ఈ ముద్దుగుమ్మ, ఇటీవల తెలుగుతోపాటు బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. కాగా ఈ హీరోయిన్ కర్ణాటకలోని కోడుగు అనే జిల్లాలో.. జన్మించింది. మరోపక్క..కొద్ది రోజులుగా టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ తో రిలేషన్ లో ఉందంటూ వార్తలు వినిపిస్తున్నా.. ఇద్దరూ కూడా ఇండైరెక్టుగా హింట్స్ ఇస్తున్నారు. కానీ డైరెక్ట్ గా హింట్ ఇచ్చిన సందర్భాలు లేవు.
ఇక తాజాగా బాలీవుడ్ లో ఛత్రపతి శంభాజీ శివాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా రూపొందుతున్న ఛావా సినిమాలో శంబాజీ భార్య పాత్రలో నటిస్తోంది రష్మిక ఇక ఈ సినిమా ఈవెంట్ అక్కడ ఘనంగా నిర్వహించగా.. అందులో తాను హైదరాబాద్ నుంచి వచ్చానని.. తాను సింగిల్ గా వచ్చానని అయితే తనను ఇక్కడ బాలీవుడ్ తన కుటుంబంలో చేర్చుకుంటారని ఆశిస్తున్నాను అంటూ తెలిపింది.
అయితే రష్మిక కి ఇప్పుడే తను జన్మించిన కర్ణాటకలో కొంచెం నెగిటివిటీ ఉన్న సంగతి తెలిసిందే. అప్పట్లో కాంతారా టైంలో.. ఈ హీరోయిన్ చేసిన వ్యాఖ్యలు.. అందరిని కోపానికి గురిచే సాయి. అంతేకాకుండా ఇన్ డైరెక్ట్ గా రిషబ్ శెట్టి రష్మికపై కౌంటర్లు వేశారు.
ఈ క్రమంలో..రష్మిక హైదరాబాద్ నుంచి వచ్చానని చెప్పడంతో ఈమె కర్ణాటక కదా అదేంటి..? హైదరాబాద్ నుంచి వచ్చానని చెబుతోంది… అంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు. మరికొంతమంది ఇంకొంచెం ముందుకు వెళ్లి.. ఇది రష్మిక రిషబ్ కి కౌంటర్ ఇవ్వదమే కాకుండా.. విజయ్ తో రిలేషన్ లో ఉన్నాను అన్న క్లారిటీ కూడా ఇచ్చేసింది అని కామెంట్స్ పెడుతున్నారు.