ఉదయాన్నే ఇది తింటే.. మలబద్దకానికి 100 శాతం చెక్‌!

Dharmaraju Dhurishetty
Feb 13,2025
';

రోజు ఉదయాన్నే స్వీట్ కార్న్ సలాడ్ తీసుకోవడం వల్ల శరీరానికి తగిన మోతాదులో ఫైబర్‌తో పాటు అనేక రకాల పోషకాలు లభిస్తాయి.

';

స్వీట్ కార్న్‌లో ఉండే పిండి పదార్థాలు మెగ్నీషియం, ఫాస్ఫరస్‌తో పాటు ఇతర యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి.

';

గుండె సమస్యలతో బాధపడుతున్న వారు రోజు ఈ స్వీట్ కార్న్ సలాడ్ తినడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు పొందగలుగుతారు.

';

ముఖ్యంగా మలబద్దకం సమస్యతో బాధపడే వారికి స్వీట్ కార్న్ సలాడ్ ఒక వరం లాంటిది. ఇందులో విటమిన్లు (B, C) పుష్కలంగా లభిస్తాయి. దీంతోపాటు ఫైబర్ కూడా ఉంటుంది.

';

పొట్ట సమస్యలతో తీవ్ర ఇబ్బందులు పడేవారు రోజు ఉదయాన్నే ఈ సలాడ్ తింటే సులభంగా వాటి నుంచి విముక్తి పొందుతారు.

';

మీరు కూడా ఈ స్వీట్ కార్న్ సలాడ్ని ఇంట్లో ఎంతో సులభంగా తయారు చేసుకోవాలనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడే ట్రై చేయండి.

';

కావలసిన పదార్థాలు: 2 కప్పుల స్వీట్ కార్న్, 1/2 కప్పు ఉల్లిపాయలు (సన్నగా తరిగిన), 1/2 కప్పు టమాటోలు (సన్నగా తరిగిన), 1/4 కప్పు కీరదోసకాయ (సన్నగా తరిగిన)

';

కావలసిన పదార్థాలు: 1/4 కప్పు కొత్తిమీర (సన్నగా తరిగిన), 1/4 కప్పు నిమ్మరసం, 1/2 టీస్పూన్ ఉప్పు, 1/4 టీస్పూన్ నల్ల మిరియాల పొడి, 1/4 టీస్పూన్ జీలకర్ర పొడి

';

తయారీ విధానం: ముందుగా ఒక పెద్ద బౌల్ తీసుకొని అందులో స్వీట్ కార్న్ తో పాటు ఉల్లిపాయలు, టమాటోలు, కీరదోసకాయ, కొత్తిమీర వేసి బాగా మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది.

';

అన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత అందులోనే తగినంత నిమ్మరసం, ఉప్పు, నల్ల మిరియాల పొడి, జీలకర్ర పొడి, వేసి మరికొద్దిసేపు బాగా మిక్స్ చేసుకోండి.

';

ఇలా అన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత దాదాపు 15 నుంచి 25 నిమిషాల వరకు దీనిని పక్కన పెట్టుకోండి. అంతే స్వీట్ కార్న్ సలాడ్ రెడీ అయినట్లే..

';

ఇలా తయారు చేసుకున్న సలాడ్ రోజు ఉదయాన్నే తింటే ఎలాంటి పొట్ట సమస్యలైనా శాశ్వతంగా తగ్గాల్సిందే..

';

VIEW ALL

Read Next Story