తయారీ విధానం: ముందుగా నువ్వుల లడ్డూలను తయారు చేసుకోవడానికి స్టవ్ పై ఓ పాన్ పెట్టుకుని అందులో నువ్వులను వేసుకొని దోరగా వేయించుకోవాల్సి ఉంటుంది.
';
ఇలా వేపుకున్న తర్వాత నువ్వులను మిక్సీ జార్లో వేసుకొని, తగినంత నెయ్యి, జీడిపప్పు, యాలకుల పొడి, తాటి బెల్లం వేసుకొని మిక్సీ పట్టుకోండి.
';
ఇలా మిక్సీ పట్టుకునే క్రమంలో నువ్వులు బెల్లము అన్నీ కలిసి ముద్దలా తయారవుతుంది. ఇలా తయారైన వెంటనే ఒక బౌల్ లోకి తీసుకొని.. చిన్నచిన్న ముద్దలు కట్టుకోండి.
';
చిన్నచిన్న లడ్డులు కట్టుకుంటూ గాజు సీసాలో భద్రపరచుకోండి. అంతే ఎన్నో పోషకాలు కలిగిన నవ్వుల లడ్డు తయారైనట్లే...