రామ్ చరణ్ సినీ రంగానికి చెందిన వ్యక్తి. ఉపాసన అపోలో హాస్పిటల్స్ ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తి. ఓ పార్టీలో కలుసుకున్న వీళ్లు ఒకిరినొకరు ప్రేమించుకొని పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు.
గతేడాది డిసెంబర్ 4న వీళ్లిద్దరు పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది.
పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్.. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన 'బద్రి' సినిమాలో తొలిసారి కలిసి నటించారు. ఆ తర్వాత వీళ్లిద్దరు కొన్నేళ్లు డేటింగ్ చేసి ఓ పిల్లాడు పుట్టిన తర్వాత పెళ్లి చేసుకున్నారు.
నాచురల్ స్టార్ నాని భార్య కాస్ట్యూమ్ డిజైనర్‌గా పనిచేస్తూ ఉండేది. ఈమె బెంగళూరులోని నిఫ్ట్‌లో కాలేజిలో ఫ్యాషన్ డిజైనింగ్ పూర్తి చేసిన అంజనా.. ఇపుడు ఆర్కా మీడియాలో పనిచేస్తోంది. వీళ్లిద్దరిది కూడా ప్రేమ వివాహామే.
సూపర్ స్టార్ మహేష్ బాబు, నమ్రత తొలిసారి వంశీ సినిమాలో కలిసి నటించారు. ఈ తర్వాత ఒకరి అభిప్రాయాలు కలిసిన తర్వాత ఏడడుగులు వేశారు.
అల్లు అర్జున్, స్నేహారెడ్డిలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇక స్నేహా రెడ్డికి సినీ రంగంతో అసలు సంబంధం లేదు.
కొన్ని సినిమాల్లో కలిసి నటించిన వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిలు.. గతేడాది పెద్దలను ఒప్పించి మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు.