ఏం చేసినా గ్యాస్టిక్ తగ్గడం లేదా.. ఉదయాన్నే ఇది తిని చూడండి..
Dharmaraju Dhurishetty
Feb 13,2025
';
ఆధునిక జీవనశైలిలో అనారోగ్యకరమైన ఆహారాలు ఎక్కువగా తినడం వల్ల చాలా మందిలో అనేక పొట్ట సమస్యలు వస్తున్నాయి.
';
ముఖ్యంగా కొంతమందిలో గ్యాస్టిక్ సమస్య విపరీతంగా పెరిగిపోతోంది. దీనికి తోడు మలబద్ధకం కూడా తోడవుతోంది.
';
గ్యాస్ట్రిక్, మలబద్ధకం వంటి సమస్యలతో బాధపడే వారిలో భవిష్యత్తులో అనేక రకాల ప్రేగుల సమస్యలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి.
';
ఈ రెండు సమస్యల నుంచి సులభంగా విముక్తి పొందడానికి అనేక మార్గాలు ఉన్నాయి. ముఖ్యంగా ఆరోగ్య నిపుణులు సూచించిన కొన్ని రకాల ఆహార పదార్థాలు కలిగిన మిశ్రమం రోజు తింటే విశేషమైన ప్రయోజనాలు పొందుతారు.
';
ముఖ్యంగా ప్రతిరోజు దోసకాయను సలాడ్ల తయారుచేసి తింటే కేవలం పది రోజుల్లోనే శాశ్వత పరిష్కారం పొందవచ్చు.
';
కీరదోసకాయ సలాడ్ లో విటమిన్ K, విటమిన్ C ఎక్కువ మోతాదులో లభిస్తాయి. రోజు తింటే అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి.
';
ముఖ్యంగా ఈ సలాడ్ లో ఉండే కొన్ని అద్భుతమైన గుణాలు సులభంగా పొట్ట నొప్పిని, గ్యాస్ట్రిక్ ను తగ్గిస్తాయి.
';
అయితే మీరు కూడా ఈ సలాడ్‌ని ఇంట్లోనే తయారు చేసుకొని తినాలనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడే ట్రై చేయండి.
కావలసిన పదార్థాలు: కరివేపాకు - 1 రెమ్మ, జీలకర్ర - 1/2 స్పూన్, ఇంగువ - చిటికెడు, ఉప్పు - రుచికి తగినంత, నూనె - 1 స్పూన్
';
తయారీ విధానం: ముందుగా ఈ సలాడ్ ను తయారు చేసుకోవడానికి కీరదోసకాయతో పాటు క్యారెట్ను పైపొట్టు తీసి శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది.
';
శుభ్రం చేసుకున్న క్యారెట్ కీరదోసకాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఓ బౌల్ లోకి తీసుకోవాల్సి ఉంటుంది.
';
డ్రెస్సింగ్ కోసం మరో బౌల్ తీసుకొని అందులో తగినంత పెరుగు, చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్న పచ్చిమిర్చి, ఉప్పు, అల్లం ముక్కలు, ఇంగువ, ఆవాల నూనె, మిర్యాల పొడి వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి.
';
డ్రెస్సింగ్ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అందులో తరుగుకున్న క్యారెట్ కీరదోసకాయ ముక్కలను వేసి బాగా మిక్స్ చేయండి. అంతే సలాడ్ రెడీ అయినట్లే.
';
ఇలా తయారు చేసుకున్న సలాడ్ రోజు ఉదయాన్నే తినడం వల్ల గ్యాస్టిక్ సమస్యలతో పాటు పొట్ట సమస్యలు దూరం అవుతాయి.