తెల్ల అన్నం తింటే బరువు పెరుగుతారనే అభిప్రాయం చాలా మందిలో ఉంటుంది. అయితే సరైన విధంగా తింటే తెల్ల అన్నంతో కూడా బరువు తగ్గొచ్చని మీకు తెలుసా?
ఎక్కువగా కాకుండా తక్కువ పరిమాణంలో తెల్ల అన్నం తింటే బరువు నియంత్రణలో ఉంటుంది.
అన్నంతో పాటు కూరగాయలు, పప్పులు కలిపితే ఫైబర్ అధికంగా ఉండి మెరుగైన జీర్ణక్రియకు సహాయపడుతుంది.
తెల్ల అన్నాన్ని పెరుగు, పన్నీర్, చికెన్ వంటి ప్రోటీన్ సమృద్ధిగల ఆహారాలతో కలిపి తింటే శరీరానికి మేలు చేస్తుంది.
రాత్రి వేళల్లో ఎక్కువ కార్బోహైడ్రేట్లు తీసుకోవడం.. తగ్గించడం బరువు తగ్గేందుకు ఉపయోగపడుతుంది. కాబట్టి మధ్యాహ్నం ఒక్క పూట తెల్లన్నం తిని రాత్రిపూట దాన్ని పూర్తిగా పక్కన పెట్టండి.
చిన్న ప్లేట్‌లో తినడం ద్వారా తినే పరిమాణాన్ని తగ్గించుకోవచ్చు.
సాధారణ అన్నం కంటే కొద్దిగా మెరుగైనదిగా బాయిల్డ్ రైస్ తీసుకోవడం మంచిది.
సరైన విధంగా నియంత్రణ పాటిస్తూ తింటే తెల్ల అన్నం కూడా బరువు తగ్గే ఆహారంగా మారుతుంది.
పైన చెప్పిన వివరాలు అధ్యయనాలు, పోషక నిపుణుల సలహాల మేరకు చెప్పినవి మాత్రమే.