Richest Comedians in India: అందరి కంటే ఎవరు ఎక్కువ రిచ్ అంటే..
Richest Comedians in India and Brahmanandam's net worth: ఇండియాలో రిచెస్ట్ కమెడియన్ ఎవరంటే అందరి దృష్టి ప్రస్తుతం ఇండస్ట్రీని ఓ ఊపు ఊపుతున్న కపిల్ శర్మపై, లేదంటే జానీ లీవర్, పరేష్ రావల్ లేదా రాజ్‌పాల్ యాదవ్ లాంటి సీనియర్ కమెడియన్స్ పైనో పడుతుంది. కానీ న్యూస్ 18 ప్రచురించిన ఓ కథనం ప్రకారం, ఆ టాప్ ర్యాంకర్ మరెవరో కాదు.. మన తెలుగు హాస్యనటుడు కన్నెగంటి బ్రహ్మానందమే. అవును, ఆ వార్తా కథనం ప్రకారం బ్రహ్మానందం నెట్ వర్త్ 50 మిలియన్ డాలర్లకు పైనే ఉంది అని తెలుస్తోంది.
బ్రహ్మానందం నెట్ వర్త్
బ్రహ్మానందం తను నటించే సినిమాలు అన్నీ కలిపి నెలకు కనీసం రూ. 2 కోట్లకుపైనే రెమ్యునరేషన్ అందుకుంటున్నారు. బ్రహ్మీ బ్రాండ్ ఎండార్స్‌మెంట్ డీల్స్ కూడా కోటి రూపాయలకు పై మాటే ఉంటాయి. 1000 చిత్రాలలో నటించిన నటుడిగా మన బ్రహ్మీ ఎప్పుడో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకున్న విషయం తెలిసిందే. తెలుగు సినీ పరిశ్రమలో కళామ తల్లికి చేసిన కృషికి గాను పద్మశ్రీ అవార్డు సైతం వరించింది. ఇప్పటికీ ఇండియాలో అత్యధిక పారితోషికం అందుకునే హాస్య నటుల్లో బ్రహ్మానందం కూడా ఒకరు.
కామెడీ నైట్స్ విత్ కపిల్ శర్మతో కపిల్ శర్మ ఇండస్ట్రీలోకి రావడానికి రెండున్నర దశాబ్ధాల క్రితమే పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన బ్రహ్మానందంతో అసలు కపిల్ శర్మకు పోలీకే లేదు. అహ నా పెళ్లంట, మనీ, అన్న, అనగనగా ఒక రోజు, వినోదం, రెడీ, మన్మధుడు, రేసు గుర్రం, దూకుడు.. ఇలా చెప్పుకుంటూ పోతే బ్రహ్మీ ఖాతాలో పెద్ద చేంతాడంత చిట్టానే ఉంది. అలా ఎన్నో సూపర్‌హిట్ చిత్రాలలో తన కామెడితో ఆడియెన్స్ ని కడుపుబ్బా నవ్వించి తెలుగు సినీ పరిశ్రమలోనే కాదు.. తెలుగు వారిలోనూ బ్రహ్మీ చెరగని ముద్ర వేసుకున్నాడు. ఆస్తులు, అంతస్తుల్లోనే కాదు.. అభిమానుల హృదయాల్లో చోటు సంపాదించుకోవడంలోనూ బ్రహ్మానందం నెట్ వర్త్ వెల కట్టలేనిది.
ఇది కూడా చదవండి : Rajamouli Oppo Ad: ఒప్పో యాడ్ లో నటించిన రాజమౌళి.. లుక్ మామూలుగా లేదుగా..!
బ్రహ్మానందం వద్ద ఆడి R8, ఆడి Q7, బ్లాక్ లగ్జరీ మెర్సిడెస్-బెంజ్ వంటి అనేక లగ్జరీ కార్ల కలెక్షన్ ఉంది. న్యూస్18 కథనం ప్రకారం, బాలీవుడ్‌కి బ్రహ్మీ లాంటి టాప్ కమెడియన్ అయిన జానీ లీవర్ నెట్ వర్త్ రూ. 225 కోట్లు, రాజ్‌పాల్ యాదవ్ నెట్‌వర్త్ రూ. 50 కోట్లు మేరకు ఉంటుందని ఒక అంచనా.
ఇది కూడా చదవండి : King of Kotha Teaser: ‘'కింగ్ ఆఫ్ కోటా'’ టీజర్ వచ్చేసింది.. గ్యాంగ్‍స్టర్‌గా దుల్కర్ కుమ్మేశాడు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK
Richest Comedians in India: అందరి కంటే ఎవరు ఎక్కువ రిచ్ అంటే..
